Lunar Eclipse: కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
హిందూ మత గ్రంథాలలో చంద్ర గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు..సూర్యుని కాంతి చంద్రునిపై పడదు. అప్పుడు భూమి మీద ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. కనుక దీనిని చంద్ర గ్రహణం అని అంటారు. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతోంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? భారతదేశంపై ప్రభావం చూపుతుందా లేదా? లేదా అనే విషయాలు తెలుసుకుందాం!
జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం కొత్త సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. 2025 సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిథి మార్చి 14 న వచ్చింది. హోలీ పండగ కూడా ఆ రోజే రావడం విశేషం. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున కొత్త సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణానికి సూత కాలం ఉండదు. గ్రహణం కనిపించినప్పుడే సూతకాలాన్ని పాటిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 14, 2025న ఉదయం 9:29 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ మహాసముద్రం, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ ఉత్తర ధ్రువంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణం పగలు ఏర్పడుతుంది కనుక భారతదేశంలో కనిపించదు. ఈ కారణంగా చంద్ర గ్రహణ సమయంలో సూతకాలం ఉండదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.