Viral: ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!

|

May 26, 2024 | 6:14 PM

భారత దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తుంటారు. ఎవరు ఏం చేసినా సమాజం బావుండాలని, తమ గ్రామం క్షేమంగా ఉండాలని, పాడిపంటలతో విలసిల్లాలని కోరుకుంటారు. అందుకు రకరకాల ఆచారాలు పాటిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దేవతలను వివిధ సంప్రదాయాలలో వేడుకుంటారు.

కొమురంభీం జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో అట్టహాసంగా బొమ్మల పెళ్ళి జరిగింది. ఊర్లో అందరు బాగుండాలి, ఎలాంటి రోగాలు తమ ఊరిప్రజలకు రాకూడదని, పంటలు బాగాపండాలని, ఊరంతా సుఖశాంతులతో ఉండాలని, గ్రామస్తులంతా స్నేహభావంతో కలసిమెలసి ఉండాలనే సంకల్పంతో ఊర్లోని పిల్లలందరూ కలిసి బొమ్మలకు పెళ్లి జరిపించారు. ఈ పెళ్లిలో పెద్దలు కూడా పాల్గొన్నారు. చిన్న పిల్లల ఆటలా కాకుండా నిజమైన పెళ్లి జరిపించినట్టే బొమ్మల పెళ్లి చేశారు. భాజభజంత్రీలతో, డాన్సులు చేస్తూ ద్విచక్రవాహనంపై వరుడు బొమ్మను పెద్ద ఎత్తున ఊరేగిస్తూ కళ్యాణవేదికకు తీసుకొచ్చారు వరుడితరపు పెద్దలు. ఇక వధువు తరపు ముత్తయిదువలు చిన్నారి పెళ్లికూతురిని అందంగా ముస్తాబు చేసి పెళ్లి పందిరిలోకి తీసుకొచ్చారు. వధూవరుల బొమ్మలకు బాసికం కట్టి, కళ్యాణ కంకణాలు ధరింపచేసి, సంప్రదాయ బద్ధంగా బొమ్మలకు పెళ్లి జరిపించారు. అనంతరం గ్రామస్తులందరికీ విందుకూడా ఏర్పాటు చేశారు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందంగా విందును ఆరగించారు. ఈ పెళ్లి వేడుకలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. ఇది కేవలం బొమ్మల పెళ్లి కాదని, ఎనిమిదేళ్లుగా తమ గ్రామం క్షేమం కోరి కొనసాగుతున్న ఆచారమని గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏటా మే నెలలో ఈ బొమ్మల పెళ్లి నిర్వహించడం ఆనవాయితీ అని, ఇలా చేయడం వల్ల తమ గ్రామం సుభిక్షంగా ఉందని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: May 26, 2024 06:14 PM