ప్రస్తుతం కాలంలో చాలా మందిలో మానవత్వం కనుమరుగవుతుంది. ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. అయితే ఇంకా కూడా మానవత్వం కొంత మంది రూపంలో బ్రతికే ఉందని కొన్ని సార్లు రుజవవుతుంది. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అంబులెన్స్ వెళ్ళడానికి రహదారిపై ఉన్న వాళ్ళు.. చేసిన పనికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఆ వీడియోలో.. రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కార్లన్ని రహదారి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఇక అదే దారి గుండా.. ఓ అంబులెన్స్ వచ్చింది. అది వెళ్ళడానికి ఎలాంటి మార్గం లేదు. దీంతో ఆ కార్లలో ఉన్న డ్రైవర్లు ఒక్కసారిగా బయటకు వచ్చి.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ శంకాలను తొలగించారు. మేము అత్యవసర చికిత్స కోసం వెళ్తున్న సమయంలో ఇలా జరిగింది.. అంటూ ఆ వీడియోలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు దీనికి 22కే కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇది చూసిన నెటిజన్లు డ్రైవర్స్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఆ వీడియోను ఓసారి చూసెయ్యండి.
ట్వీట్..
Also Read: Vijay Antony: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ‘విజయ రాఘవన్’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..
ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్… ఎమోషనల్ అయిన బిగ్బాస్ బ్యూటీ.. లైవ్‍లోనే కన్నీళ్లు పెట్టుకున్న అషూరెడ్డి…
Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న అభిమానులు..