Viral Video: చూస్తుండగానే కుప్పకూలి నదిలో పడిపోయిన బ్రిడ్జి..! వాహనాల సైతం వదలని వరదనీరు..(వీడియో)

Viral Video: చూస్తుండగానే కుప్పకూలి నదిలో పడిపోయిన బ్రిడ్జి..! వాహనాల సైతం వదలని వరదనీరు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 04, 2022 | 9:17 AM

Shocking Video: ప్రస్తుత కాలంలో అణు బాంబును ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా పరిగణించవచ్చు కానీ వాస్తవానికి ఈ ప్రపంచంలో ప్రకృతి కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ప్రకృతి ఆగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరు.



Shocking Video: ప్రస్తుత కాలంలో అణు బాంబును ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా పరిగణించవచ్చు కానీ వాస్తవానికి ఈ ప్రపంచంలో ప్రకృతి కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ప్రకృతి ఆగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరు. సునామీ, అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల ఎలాంటి విధ్వంసం జరిగిందో చరిత్ర గమనిస్తే తెలుస్తుంది. ఒక్కోసారి వందలాది మంది ఒకేసారి మరణించారనే వార్తలు కూడా వినాల్సి వస్తోంది.పెద్ద పెద్ద ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు పదే పదే చూస్తారు. వాటిలో కొన్ని ప్రజలను అలరిస్తాయి మరికొన్ని భావోద్వేగాలను గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా వణికిపోతారు.

వాస్తవానికి ఈ వీడియోలో ఒక వంతెన అకస్మాత్తుగా విరిగిపోతుంది. చాలా మంది ప్రజలు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు. గగుర్పాటు కలిగించే ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యం బ్రెజిల్‌లోని ఏదో ఒక ప్రదేశంలో జరిగిందని చెబుతున్నారు.

వీడియోలో మొదటగా వంతెన సురక్షితంగా ఉండటం మనం చూడవచ్చు. కొంతమంది దానిపై నడుస్తూ కనిపిస్తారు. వారు వంతెనకు అవతలి వైపు నుంచి ఇటు వైపునకు రావడానికి ప్రయత్నిస్తారు. అయితే మధ్యలోనే వంతెన అకస్మాత్తుగా విరిగి నీటిలో పడిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. బలమైన నీటి ప్రవాహం చాలామందిని చంపేసే ఉంటుంది. ఎందుకంటే నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. అందులో నుంచి ఎవరినైనా రక్షించడానికి కూడా వీలులేకుండా ఉంది. బ్రిడ్జిపై వెళుతున్న వారికి మరుసటి క్షణం ఏం జరగబోతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వీడియోని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. కామెంట్లు, షేర్స్‌ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూస్తే మీ అభిప్రాయం తెలియజేయండి.

Published on: Feb 04, 2022 09:03 AM