Bride – Groom: పెళ్లిపీటల మీద ముద్దుపెట్టిన వరుడికి షాకిచ్చిన వధువు..! షాక్ లో అతిధులు.. వీడియో వైరల్.
మెడలో తాళికట్టిన తర్వాత అతిథులు చూస్తుండగానే వేదికపైనే వధువుకి ముద్దు పెడతానని స్నేహితులతో వరుడు పందెం కాశాడు. వివాహ సంప్రదాయంలో భాగంగా మెడలో మాల వేస్తూ ఆమెకు ముద్దు పెట్టాడు.
మెడలో తాళికట్టిన తర్వాత అతిథులు చూస్తుండగానే వేదికపైనే వధువుకి ముద్దు పెడతానని స్నేహితులతో వరుడు పందెం కాశాడు. వివాహ సంప్రదాయంలో భాగంగా మెడలో మాల వేస్తూ ఆమెకు ముద్దు పెట్టాడు. అతడి ప్రవర్తనతో ఖంగుతిన్న పెళ్లికూతురు.. అసలు వరుడే వద్దునుకుని వెళ్లిపోయింది. వరుడు ముద్దుపెట్టాడనే కారణంతో నవ వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకలో చోటుచేసుకుంది. బదాయూ జిల్లా బిల్సీకి చెందిన యువకుడికి.. బహ్జోయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 27న వివాహానికి ముహూర్తంగా నిర్ణయించారు. పెళ్లికి 300 మంది వరకూ అతిథిలు హాజరయ్యారు. వివాహ ఆచారంలో భాగంగా వధువు మెడలో మాల వేస్తున్న వరుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి పెళ్లి రద్దుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.. ఈ పంచాయతీ పోలీసుల దాకా వెళ్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పినా.. వధువు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో పెళ్లి రద్దు చేసుకుని రెండు కుటుంబాలు వెళ్లిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..