Selfie: సెల్ఫీ పిచ్చితో ప్రమాదం..కాలుజారి లోయలో పడ్డ వధువు.. ఇంక పెళ్లి సంగతి ఏంటో..

Updated on: Dec 16, 2022 | 8:15 PM

రళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్‌.కుమార్‌కు


రళలోని ఓ ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకలు ఒక్క సెల్ఫీతో వాయిదా పడ్డాయి. కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్‌కు.. కల్లవుతుక్కల్‌ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్‌.కుమార్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. డిసెంబర్‌ 9న ఘనంగా వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులు తమ కుటుంబసభ్యులతో గురువారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి వెళ్లారు. పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. తర్వాత దగ్గర్లోనే ఉన్న క్వారీని చూడడానికి అందరూ వెళ్లారు.అదే సమయంలో విని కృష్ణన్‌, శాండ్ర క్వారీ అంచుకు వెళ్లి సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ స్టిల్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే కాలుజారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ లోయలో పడిపోయింది శాండ్ర. వెంటనే వరుడు కూడా ఆమెను కాపాడడానికి దూకేశాడు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న శాండ్రను విని కృష్ణన్‌ కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు.ఈ విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. సహాయక సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా గాయపడిన వీరిద్దరూ కొల్లాంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:15 PM