ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు.. ఎందుకంటే ??

Updated on: May 08, 2025 | 7:21 PM

సీతారాముల కళ్యాణం చేసే సందర్భంలో ఊరంతా పందిరి ముత్యాల తలంబరాలు అనే మాటలు మనం వింటూనే ఉంటాం. ఇప్పుడు ఎందుకులే వీటి గురించి అనుకోకండి. ఒక్కసారి ఈ ఎండలో ఆంధ్రా లాస్ వేగాస్ భీమవరం వెళితే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ దాకా గ్రీన్ మ్యాట్లతో వేసిన పందిళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవి భోజనాలు పెట్టడానికో ఓ ఫంక్షన్ కోసమో వేసినవి కాదు.

ఈ సీజన్ లో ఎండలు తట్టుకోలేక రైల్వే లైన్ క్రాసింగ్ దగ్గర నిమిషాలు కొద్ది నిలబడలేక ఇలాంటి గ్రీన్ మ్యాట్ పందిళ్ళు వేశారు అధికారులు. వేసవి కాలంలో ఎండ దెబ్బకు బయటకు రావాలంటే జనం బెంబేలెత్తు పోతున్నారు. అలాంటిది వేసవి కాలంలో ప్రయాణం అంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అదే మండుటెండలో నడి రోడ్డుపై ప్రయాణిస్తూ ఉండగా రైల్వే గేటు పడిందంటే నరకం కనిపిస్తుంది. ఒక్కసారి ఐదు నుండి 25 నిమిషాల వరకు రైల్వే గేటు తీసేవరకు ఎండలో మలమల మాడుతూ ఉండాల్సిందే. ఈ దారుణమైన అనుభవాన్ని చాలా మంది అనుభవించే ఉంటారు. అలాంటి సమయంలో కొంచెం నీడ దొరికితే చాలు అనిపిస్తుంది ప్రాణానికి. ఈ క్రమంలోనే ఎండ దెబ్బ నుంచి ప్రయాణికులకు కాపాడేందుకు అధికారులు పందిళ్ళు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో మున్సిపల్ అధికారులు చేసిన ఈ చిన్న పనికి వాహనదారులు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించే వారికి ఎండవేడి తగలకుండా రైల్వే గేటుకు రెండు వైపులా పందిళ్ళు వేయించారు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ఇరువైపులా ఎత్తైన సర్వే కాలలు పాతించి దానిపై గ్రీన్ మ్యాట్ తో పందిరి వేయించారు. భారీ వాహనాలు వెళ్ళిన ఇబ్బంది లేకుండా వాటిని ఏర్పాటు చేయించారు. ఎక్కువగా ట్రాఫిక్ నిలిచిపోయే భీమవరం ఉండి రోడ్డులోని రైల్వే గేటు బైపాస్ రోడ్డులోని రైల్వే గేటు వద్ద భారీ స్థాయిలో చల్లని పందిళ్ళు వేయించారు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. ప్రయాణికులకు వడదెబ్బ ఎండ తీవ్రత నుండి కాపాడడానికి తక్కువ ఖర్చుతో చల్లని పందిళ్ళు వేయించామని ఇవి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఎండ తీవ్రత ఎంత ఉన్న రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి ప్రయాణికులు పందిళ్ళ కింద ఉపశమనం పొందుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆపరేషన్ సింధూర్‌ !! భారత ఆర్మీకి జేజేలు కొట్టిన మన హీరోలు

ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??

నమ్మి లొంగిపోతే.. వీడియో తీసి లీక్ చేశాడు !! లవర్‌ నిర్వాకంతో.. హీరోయిన్ గాయబ్‌ !!

సన్యాసినిగా మారిన టాలీవుడ్ హీరోయిన్

యాక్షన్ సీన్స్ లేవు.. స్పెషల్ సాంగ్స్ లేవు.. కానీ కల్కి, పుష్ప 2 లనే బీట్ చేసింది!