మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..  లేదంటే ఫైన్ కట్టాల్సిందే

మీరు కుక్కను పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే

Phani CH

|

Updated on: Nov 15, 2022 | 9:51 AM

మీరు కుక్కను పెంచుతున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. కుక్కలను ప్రేమగా పెంచడమే కాదు వాటిపట్ల బాధ్యతగా ఉండాలి. వాటినుంచి ఇతరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవాలి.

మీరు కుక్కను పెంచుతున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. కుక్కలను ప్రేమగా పెంచడమే కాదు వాటిపట్ల బాధ్యతగా ఉండాలి. వాటినుంచి ఇతరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువుల విషయంలో బాధ్యతగా ఉండాలని నోయిడా అధికార యంత్రాంగం పేర్కొంది. ఇందులో భాగంగా నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలు ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించింది. లేని పక్షంలో 2 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే మీ పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లినపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒకవేళ మీ కుక్క ఎవరినైనా కరిచి గాయపరిస్తే పదివేల జరిమానా కట్టాల్సి ఉంటుందని నోయిడా అథారిటీ సీఈవో పేరుతో ఆదేశాలు జారీ చేశారు. పెంపుడు జంతువులకు సంబంధించి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనలు అమలుచేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగులో పాటలు పాడుతూ అదరగొడుతున్న విదేశీ వనిత !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!

రష్యన్‌ ఫుట్‌బాలర్‌‌కు పోర్న్‌స్టార్‌ బంపర్ ఆఫర్‌ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??

ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో​ బాంబ్‌ బ్లాస్ట్‌.. ఆరుగురు మృతి.. వీడియో వైర‌ల్!

 

Published on: Nov 15, 2022 09:51 AM