అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??

సొంతంగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లా కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకోసం ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??

|

Updated on: Nov 15, 2022 | 9:42 AM

సొంతంగా ఓ ఇల్లు లేదా ఖరీదైన విల్లా కొనుగోలు చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. అందుకోసం ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో అదే డబ్బుతో ఏకంగా ఓ గ్రామాన్నే కొనొచ్చంటే.. ఇది నిజం… అవును.. స్పెయిన్‌లోని ఓ గ్రామాన్ని ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ధర కూడా అందుబాటులోనే. కేవలం 2,27,000 యూరోలకే అంటే భారత కరెన్సీలో సుమారు 2కోట్ల 16లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తే గ్రామం మొత్తం సొంతం చేసుకోవచ్చు. సాల్టో డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్‌ సరిహద్దులో ఉంది. రాజధాని మాడ్రిడ్‌ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. 1950ల్లో ఆ ప్రాంతంలో ఓ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ నివాసాలు ఏర్పాటు చేసింది. అయితే, ఆ ప్రాజెక్టు పూర్తైన తర్వాత అక్కడివారంతా సమీప పట్టణాలకు తరలిపోయారు. ఇలా 1990 చివరి నాటికి ఆ ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. అక్కడ 44 ఇల్లు, ఓ హోటల్‌, చర్చి, పాఠశాల, స్విమ్మింగ్‌ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో​ బాంబ్‌ బ్లాస్ట్‌.. ఆరుగురు మృతి.. వీడియో వైర‌ల్!

18ఏళ్లుగా ఎయిర్​పోర్ట్​లోనే మకాం.. చివరకు అక్కడే !!

29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్‌.. ఇప్పుడు అతనో మిలియనీర్‌

ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్‌.. వందే భారత్‌ రైల్లో..

మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??

 

Follow us
Latest Articles
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!