టర్కీలోని ఇస్తాంబుల్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఆరుగురు మృతి.. వీడియో వైరల్!
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే ఇస్తిక్‌లాల్ షాపింగ్ వీధిలో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే ఇస్తిక్‌లాల్ షాపింగ్ వీధిలో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్లకు ఆరుగురు మృతి చెందారు. ఇక ఈ పేఘటనలో మరో 81 మంది తీవ్రంగా గాయపడ్డారు.. పేలుడు శబ్దం విన్న స్థానికులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. భారీ పేలుడు ఘటన.. ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. అయితే.. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని టర్కీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అత్యంత రద్దీ ఉండే ఆ వీధిలో సదరు దుండగుడు బాంబును వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడి అరెస్ట్ విషయాన్ని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లూ సోమవారం ధృవీకరించారు. ఇదిలా ఉంటే.. 2015-2016లో ఇస్తిక్‌లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే మకాం.. చివరకు అక్కడే !!
29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్.. ఇప్పుడు అతనో మిలియనీర్
ఫ్లూట్ గానంతో విద్యార్థి మ్యాజిక్.. వందే భారత్ రైల్లో..
మొసలిని మింగిన కొండచిలువ.. చివరికి అతి కష్టం మీద.. ??
రహదారిపై ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

