Beer Bottles: బీరు సీసాలతో దేవాలయం.. పురాతన ఆలయానికి బీరు సీసాలతో జీర్ణోద్ధరణ.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Edited By:

Updated on: Jan 30, 2023 | 8:45 AM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించారు. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్‌ శాస్త్రవేత్తలు భావించారు.


పర్యావరణ పరిరక్షణలో భాగంగా థాయ్‌లాండ్ శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించారు. వాడేసిన గాజుసీసాలను పునర్వినియోగంలోకి తేవడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చని థాయ్‌లాండ్‌ శాస్త్రవేత్తలు భావించారు. వారి ఆలోచనకు ప్రతిరూపమే అద్బుతమైన ఈ దేవాలయం. ఖాళీ బీరు సీసాలతో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు. థాయ్‌లాండ్‌లోని సిసాకేత్‌ ప్రావిన్స్‌ ఖున్‌హాన్‌ ప్రాంతంలో ఈ సీసాల ఆలయం ఉంది. ఈ ఆలయ నిర్మాణం కోసం 1984 నుంచి ఖాళీ బీరుసీసాల సేకరణ మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణానికి 15 లక్షల ఖాళీ బీరు సీసాలను సేకరించారు. రెండేళ్లలో అలయన నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇలాగే అక్కడ మరి కొన్ని కట్టడాలను కూడా నిర్మించారు. వీటిలో ప్రార్థన మందిరాలు, శ్మశాన వాటిక, పర్యాటకుల కోసం స్నానపు గదులు, ఫౌంటెన్లు ఇలా అన్నీ పూర్తిగా సీసాలతో నిర్మించారు.వీటిలో ‘మిలియన్‌ బాటిల్‌ టెంపుల్‌’ విశేషంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ ఆలయం పేరు ‘వాట్‌ పా మహా చేది కేవ్‌’. సీసాలతో ఆలయం నిర్మించడానికి ముందు ఇక్కడ ఒక పురాతన బౌద్ధాలయం జీర్ణావస్థలో ఉండేదట. దానిని ఇలా సీసాలతో జీర్ణోద్ధరణ చేశారు. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగానే, స్థానికులే కాకుండా థాయ్‌ ప్రభుత్వం కూడా తనవంతుగా లక్షలాది ఖాళీసీసాలను ఈ ఆలయానికి పంపింది. ఈ సీసాల ఆలయం థాయ్‌లాండ్‌లో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. థాయ్‌లాండ్‌కు వచ్చే పర్యాటకుల్లో చాలామంది ప్రత్యేకించి ఇక్కడకు వచ్చి, ఈ ఆలయం వద్ద నిలబడి ఫొటోలు దిగుతుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.