Nilgiris Village: కొన్ని రోజుల్లో ఈ ప్రాంతం గడ్డకట్టేస్తుంది.! పలు చోట్ల 1 డిగ్రీ సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదు.

|

Jan 20, 2024 | 6:14 PM

తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం కారణంగా అక్కడి స్థానికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వాతావరణ మార్పుల వల్ల అక్కడి వ్యవసాయం కూడా ప్రభావితం అవుతోంది. చుట్టూ పరిసరాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విధమైన చలి వాతావరణం అసాధారణమని స్థానికులు చెబుతున్నారు.

తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండ ప్రాంతాల్లో అతిశీతల వాతావరణం కారణంగా అక్కడి స్థానికులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వాతావరణ మార్పుల వల్ల అక్కడి వ్యవసాయం కూడా ప్రభావితం అవుతోంది. చుట్టూ పరిసరాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ విధమైన చలి వాతావరణం అసాధారణమని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఉదగమండలంలోని కాంతల్, తలైకుంట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. బొటానికల్ గార్డెన్‌లో 2 డిగ్రీల సెల్సియస్, శాండినాల్లాలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం.

ఈ అసాధారణ చలి వాతావరణంపై స్థానికులు, పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్విరాన్మెంట్ సోషల్ ట్రస్ట్ NESTకి చెందిన వి శివదాస్ పేర్కొన్నారు. చలి తీవ్రత మరింత పెరుగుతోందని, ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి సవాల్‌గా మారిందని, దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున తేయాకు పంటలు ఉన్నాయి. చలి తీవ్రత ఈ పంటలను కూడా ప్రభావితం చేస్తుందని,దిగుబడి తగ్గిపోయిందని స్థానిక తేయాకు కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్‌ సుకుమారన్‌ తెలిపారు. ఇది రాబోయే నెలల్లో మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన ఆదోళన వ్యక్తం చేశారు. మరో వైపు కూరగాయ రైతులు కూడా ఈ అసాధారణ వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలిగాలుల కారణంగా ఉదయం వేళల్లో ఇంటినుంచి బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో నీలగిరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోవచ్చంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos