Telugu man in UK Elections: బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..

|

May 20, 2024 | 8:42 AM

బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో తెలుగు బిడ్డ పోటీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నారు. “బౌండరీ కమిషన్ “సూచనతో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్‌క్యులస్ సర్వే ప్రకారం లేబర్ పార్టీ 68 శాతం గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి.

బ్రిటన్ పార్లమెంట్ ఎన్ని కల్లో తెలుగు బిడ్డ పోటీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నారు. “బౌండరీ కమిషన్ “సూచనతో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్‌క్యులస్ సర్వే ప్రకారం లేబర్ పార్టీ 68 శాతం గెలవబోతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత దేశంలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతుండగా ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్ ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమై ఉంది.

సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఉదయ్ నాగరాజు అంచెలంచాలుగా ఎదిగారు. అతని తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్‎లోని యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‎లో అడ్మినిస్ట్రేటివ్‎ సైన్స్‎లో పీజీ చేశారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి అప్పట్లోనే ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్‎ని నెలకొల్పా రు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్‎కు మంచి పట్టు ఉంది. స్కూ ల్ గవర్నర్‎గా, వాలంటీర్‎గా, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన పట్టు సాధించారు. దాదాపు అన్ని సర్వే సంస్థల పక్రారం ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించి ప్రభుత్వం నెలకొల్పనుందని తెలుస్తోంది. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నెల జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.