వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే

Updated on: Dec 23, 2025 | 1:30 PM

నిర్మల్ జిల్లా లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్ తన ఎన్నికల హామీని వినూత్నంగా నెరవేర్చారు. గ్రామస్తులను పీడిస్తున్న కోతుల బెడదను తొలగించడానికి ఏకంగా ఎలుగుబంటి వేషం వేశారు. ఆయన వినూత్న ప్రయత్నంతో కోతులు గ్రామం నుండి పరారయ్యాయి. ఈ సాహసోపేత చర్యతో గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు, సర్పంచ్‌ను ప్రశంసిస్తున్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం కామన్‌.. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే స్పెషల్‌. ఇటీవల తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జరిగాయి. జనరల్‌ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా హోరాహోరీగా ప్రచారం చేసారు అభ్యర్ధులు. అంతేనా రకరకాల హామీలు ఇచ్చారు. గెలిచే వరకు ఓ బాధ.. గెలిచాక ఓ బాధ అన్నట్టుగా మారింది ఓ సర్పంచ్ పరిస్థితి. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు నేరుగా సర్పంచే రంగంలోకి దిగాల్సి వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో చాలా చోట్ల కోతుల బెడదను తొలగిస్తామని హామీ ఇచ్చారు కొందరు అభ్యర్థులు. చెప్పినట్టుగానే నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్.. కోతులను వెళ్లగొట్టేందుకు రంగంలోకి దిగాడు. మూడేళ్లుగా కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కష్టాలు ఎలాగైనా తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకే నేరుగా ఆయనే రంగంలోకి దిగాడు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గత ఏడాది గ్రామమంతా ఏకమై చందాలు వేసుకుని మరీ బోనులు ఏర్పాటు చేశారు. కొన్ని కోతులు పడ్డా.. పూర్తిస్థాయిలో కోతుల సమస్య తీరలేదు. ఈ కోతుల బెడదను తప్పించడాన్ని.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన డిమాండ్‌గా తెర మీద ఉంచారు గ్రామస్థులు. ఎవరు గెలిచినా కోతులను వెంటనే వెళ్లగొట్టాలని ఆ ఒక్కటే తాము కోరకునేది అంటూ స్పష్టం చేశారు. అందుకు సరే అని ఊ కొట్టాడు అభ్యర్థి కుమ్మరి రంజిత్. విజయం సాధించడంతో ఆయన కోతులను తరిమేందుకు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఊరంతా తిరుగుతూ గల్లీ గల్లీలోని కోతులను ఊరి నుంచి తరిమేశాడు. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్‌ను గ్రామస్తులు మెచ్చుకున్నారు. మళ్లీ కోతులు వస్తే ఈ పాచిక పారకపోతే మరో కొత్త అవతారం ఎత్తేందుకు సైతం సిద్దమంటున్నాడు ఈ నయా సర్పంచ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ20 వరల్డ్‌కప్‌ 2026.. గిల్‌కు షాక్‌.. అక్షర్‌కు ప్రమోషన్‌!

బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం

ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్‌

ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి

ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్‌ పిడిగుద్దులు.. కారణం