Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరో ట్విస్ట్.. ఈడీ అదుపులో తెలంగాణ వ్యాపారవేత్త.!

|

Nov 16, 2022 | 9:11 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఈ కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా..


ఢిల్లీ లిక్కర్ స్కాం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల ఈ కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు ఇచ్చిన సమాచారంతోనే అభిషేక్, విజయ్ నాయర్‌లను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో బోయినపల్లి అభిషేక్, విజయ్ నాయర్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. తీహార్ జైల్లో వారిద్దరిని ఉంచింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ అభిషేక్‌తో పాటు విజయ్ నాయర్ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపడుతోన్న కోర్టు.. మరికొన్ని గంటల్లో తీర్పు వెల్లడించనున్న క్రమంలో అభిషేక్, విజయ్ నాయర్‌లను సీబీఐ నుంచి ఈడీ అదుపులోకి తీసుకోవడం కీలకంగా మారింది. వారిద్దరిని కస్టడీలోకి ఇవ్వాలంటూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇప్పటివరకూ ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఐదుగురిని ఈడీ అరెస్టు చేసింది. మరోవైపు ఈడీ కస్టడీలో వినోయ్‌ బాబు, శరత్‌ విచారణ కొనసాగుతోంది. వీరిని ఏడు రోజుల కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ నేపథ్యంలో లోతుగా ఇంటరాగేషన్‌ కొనసాగుతోంది. అటు ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్టేట్‌మెంట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు రికార్డ్ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Follow us on