టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని

Updated on: Sep 05, 2025 | 7:14 PM

తల్లి..తండ్రి,..గురువు..దైవం.. తల్లి తండ్రి తర్వాత అంతటి ప్రాధాన్యత గురువుకే ఇచ్చారు. భారతీయ సంప్రదాయంలో గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలు తల్లి ఒడిని వీడి ఎక్కువ సమయం గడిపేది గురువు సమక్షంలోనే. విద్యార్ధిగా మారి తన వద్దకు వచ్చిన పిల్లవాడికి విద్యాబుద్ధులు, మంచి నడవడిక నేర్పాల్సిన బాధ్యత గురువుదే.

కానీ ఇటీవల కాలంలో గురువు అనే పదానికే మచ్చ తెస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. పవిత్రమైన టీచర్‌ వృత్తిలో ఉండి, దేవాలయం లాంటి పాఠశాలలో చేయకూడని పనులు చేస్తున్నారు. మద్యం సేవించి పాఠశాలలకు వస్తున్నవారు కొందరైతే.. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు కొందరు. తెల్లవారితే టీచర్స్‌డే.. విద్యార్ధులంతా తమ గురువులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. తమకు విద్యాబుద్ధులు నేర్పుతూ..దిశానిర్దేశం చేసే టీచర్‌ను విద్యార్ధులంతా గురువు పట్ల తమ కృతజ్ఞతను చాటుకుంటారు. అలాంటి సమయంలో ఓ టీచర్‌ తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. అంతేకాదు.. క్లాసులోనే బల్లకింద మద్యం మత్తులో స్పృహ లేకుండా పడి నిద్రపోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం సుకుద్ పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జె.విలాస్ సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పని చేస్తున్నారు. తనొక టీచర్‌ననే విషయం మరిచిపోయి మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. తప్పతాగి తరగతి గదిలోనే నిద్రపోయిన విలాస్‌ ను గమనించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు నిందితుడు మద్యం సేవించినట్లు గుర్తించి, సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారం సదరు ఎస్.జి.టి.ను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఆర్. రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!

New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే

హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు షురూ

Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?

హైదరాబాద్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు