Viral Video: ముందు మేమే తాళి కడతాం.. లేదు మేమే కడతాం.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న నవ దంపతులు.. వీడియో వైరల్..

తాళి ఎవరుముందుగా కట్టాలి అనే వివాదంలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురుతో సహా రెండు కుటుంబాలు పిడిగుద్దుల వర్షంతో మారుమోగింది తమిళనాడులోని మురుగన్ ఆలయం.

Viral Video: ముందు మేమే తాళి కడతాం.. లేదు మేమే కడతాం.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న నవ దంపతులు.. వీడియో వైరల్..
Tamil Nadu Marriage Fight

Updated on: Aug 21, 2021 | 1:11 PM

Two Families marriage Fight: తాళి ఎవరుముందుగా కట్టాలి అనే వివాదంలో పెళ్ళికొడుకు, పెళ్లికూతురుతో సహా రెండు కుటుంబాలు పిడిగుద్దుల వర్షంతో మారుమోగింది తమిళనాడులోని మురుగన్ ఆలయం. పెళ్లిళ్ల విషయంలో తలెత్తిన వివాదం.. చినికి చినికి గాలివానగా మారింది. కొట్లాటకు దారి తీసింది. చెన్నై శివారు కుండ్రతుర్‌ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కొత్త జంటలు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, ఒక్కో వివాహనికి ఇచ్చిన సమయం కేవలం అరగంట. ఆ అరగంటలో పెళ్లి పూర్తవ్వాలి.

అయితే, జంటలతో పాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో రావడంతో ముహూర్తాలు ఆలస్యమయ్యాయి. దీంతో ముందు మా పెళ్లి జరగాలంటే.. మా పెళ్లి జరగాలంటూ వాగ్వాదాలు, ఘర్షణలకు దిగారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎంత వారించినా వినిపించుకోకపోవడంతో టెన్షన్.. టెన్షన్‌ నెలకొంది. పెళ్లి వేడుకల్లో వధూవరులతో సహా బంధువులు కొట్టుకోవడం వైరల్‌గా మారింది.

శ్రావణ శుక్రవారం కావడంతో పదుల సంఖ్యలో వివాహం చేసుకోవడానికి పోటెత్తిన వధూవరులు . ఈ క్రమంలో ఒక జంటకి వివాహం చేసుకోవడానికి కేటాయించిన సమయం అరగంట. అరగంట తర్వాత మరో జంట వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటారు . వివాహాలకు బంధువులు అధికసంఖ్యలో రావడంవతో అలస్యమైన పెళ్లి ముహుర్తాలు. మేము ముందు తాళి కట్టాలి కాదు మేమె ముందు పెళ్ళిచేసుకోవాలని పలువురు వాగ్వివాదానికి దిగడం, మరి కొంతమంది సహనం కోల్పోయి ఒకరి, ఫై ఒకరు పిడిగుద్దులు వర్షం క్రుపించుకోవడంతో ఒక్కసారిగా ఆలయ పరిసర ప్రాంతాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవాదాయ శాఖ అధికారులు ఎంత వారించినా అస్సలు వినలేదు. వివాహ వేడుకలలో భక్తులు కొట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారింది.


Read Also… Young Tiger Jr. NTR : తారక్‌ అన్నా స్టైల్లోనూ తోపే… ఫ్యాన్స్‌ రీసౌండ్‌ స్టేట్‌మెంట్… దద్దరిల్లిపోతున్న సోషల్ మీడియా…!
Read Also…