వెజ్ ఫుడ్ ఆర్డర్‌లో చికెన్ ముక్క !! సినీ గీత రచయితకు చేదు అనుభవం
హోటళ్లలో ఒక ఫుడ్‌కు బదులుగా మరో ఫుడ్ సర్వ్ చేయడం.. ఆహారంలో పురుగులు పడటం వంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నాయి.
హోటళ్లలో ఒక ఫుడ్‌కు బదులుగా మరో ఫుడ్ సర్వ్ చేయడం.. ఆహారంలో పురుగులు పడటం వంటి వార్తలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నాయి. హోటళ్లలో వంటగదులు అపరిశుభ్రంగా ఉంటున్నాయనే ఫిర్యాదులు కోకొల్లలు. అలాంటి ఫొటోలు, వీడియోలు ఎందరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అధికారులు అప్పుడప్పుడు దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నా వారి పనితీరులో మాత్రం మార్పు రావడం లేదు. చెన్నైకి చెందిన కో శేష అనే తమిళ సినిమా పాటల రచయితకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల కార్న్ ఫ్రైడ్ రైస్‌తో గోబి మంచూరియాను స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ చేతికొచ్చి నోట్లో ముద్దపెట్టగానే చికెన్ ముక్క తగిలింది. ‘పుట్టినప్పటి నుంచి నాన్ వెజ్ అంటే ఏంటో తెలియని తనతో నాన్‌వెజ్ ఫుడ్ తినిపించిన స్విగ్గీ.. తన మతపరమైన మనోభావాలను కించపరిచింది’ అంటూ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినట్లు కో శేష తెలిపారు. కాగా సదరు కస్ట్‌మర్ కేర్ వాళ్లు కో శేషకు ఫుడ్ ఖరీదు 70 రూపాయలు తిప్పి పంపించింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రచయిత కనీసం జరిగిన పొరపాటుకు సదరు సంస్థ చింతించకపోగా ఏదో పెద్ద పరిహారం అందించినట్లు వ్యవహరించిందంటూ విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైనికుడి ముందు పడగవిప్పిన కింగ్ కోబ్రా !! చివరికి ఏమైందంటే ??
ibomma: ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ బిగ్ షాక్
Viral Video: ఏనుగు మంచి మనసు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే
బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

