ఘోర విపత్తు.. హిమానీనదం కూలి మొత్తం గ్రామమే కనుమరుగు వీడియో
స్విట్జర్లాండ్ లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది. బిచ్ గ్లేసియర్ హిమనీ నదం కుప్పకూలడం ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది. హిమనీ నదం కుప్పకూలడంతో ఎంతో అందమైన బ్లాటెన్ ఆల్ఫైన్ గ్రామం 90% వరకు మంచు మట్టి రాళ్లతో కూరుకుపోయింది. మే 28న జరిగిన ఈ విపత్తుకు ముందు 19వ తేదీన భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది నివాసితులు పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ 64 ఏళ్ల వృద్ధుడు కొండ చివరల కింద చిక్కుకొని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు డ్రోన్లూ జాగిలాలతో గాలింపు చేపట్టారు.
అయితే సిధిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే హిమనీ నదం కూలిపోవడంతో ఒక్కపట్టణ అందమైన గ్రామం సిధిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు. వాలెస్ ప్రాంతంలోని లాట్చెంటల్ లోయలో ఉన్న బ్లాటెన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లాంజా నదికి అడ్డుకట్టబడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్ కిప్పెల్ మునిసిపాలిటీలోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో
వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో
మిర్యాలగూడలో మిస్ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్ వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
