Mumbai: ముంబై తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.

|

Feb 08, 2024 | 8:58 PM

ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం సృష్టించింది. కువైట్‌ నుంచి ముంబయికి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం సముద్ర గస్తీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు. ముగ్గురిని తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్‌ ఆంటోనీగా గుర్తించారు.

ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా సమీపంలోని అరేబియా సముద్రంలో అనుమానాస్పద పడవ కలకలం సృష్టించింది. కువైట్‌ నుంచి ముంబయికి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం సముద్ర గస్తీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద పదార్థాలు లభించలేదు. ముగ్గురిని తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఆంటోనీ, నిడిసో డిటో, విజయ్‌ ఆంటోనీగా గుర్తించారు. మత్స్యకారులైన వీరు కువైట్‌లోని ఓ ఫిషింగ్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. యజమాని పని చేయించుకుని సరిగా జీతం చెల్లించకపోగా.. చిత్రహింసలకు గురిచేసేవాడని ఆరోపించారు. తమ పాస్‌పోర్టులను ఇవ్వకపోవడంతో తప్పించుకునేందుకు యజమాని పడవను దొంగిలించినట్లు అంగీకరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు

TOP9 ET: RRR రికార్డును బ్రేక్‌ చేసిన యానిమల్ | పవన్‌ ఫ్యాన్స్ ఓవర్‌ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..

Follow us on