Fire in Bag: చైనా ఫోనులు అంటే మనదగ్గర కొంత క్రేజ్ ఉందనేది వాస్తవం. అవి ఎంతకాలం.. ఎలా పనిచేస్తాయనేది పక్కన పెట్టి తక్కువ ధరల్లో మనకు దొరుకుతాయి.. ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. ఇదే చూస్తారు చాలా మంది. మన దగ్గర చాలా సార్లు చైనా ఫోన్లు చార్జింగ్ లో ఉండగా పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి అవి పేలి కొందరి ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, ఎటువంటి చార్జింగ్ పెట్టకుండా.. అలా బ్యాగులో పెట్టిన ఫోన్ పేలిన సంఘటన ఎప్పుడూ మనకు తెలీదు. మనకి అది అనుభవం లేదు కానీ, చైనాలో మాత్రం ఇటీవల అదే జరిగింది. ఎటువంటి చార్జింగ్ పెట్టకుండా.. బ్యాగులో పెట్టుకుని వెళుతున్న ఫోన్ పేలిపోయింది. దెబ్బతో చుట్టూ ఉన్న జనం హడలి చచ్చారు. కాకపొతే అది చైనా ఫోన్ కాదని బాధితుడు చెప్పాడు.
ఈ సంఘటన వినడానికి షాకింగ్ గానే ఉంది కదూ.. అవును.. దీని వీడియో సోషల్ మీడియాలో చూసిన వారూ ఇలాగే షాక్ అయ్యారట. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై నడిచి వెళుతున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా తన బ్యాగులోంచి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి బ్యాగ్ ను విసిరేసి అక్కడ నుంచి పక్కకు జరిగిపోయాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి చేయి, జుట్టు, కనురెప్పలు మంటలకు కాలాయని మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఆ వీడియో క్లిప్ లో బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం అది 2016లో కొన్న శాంసంగ్ ఫోన్. ఆ ఫోన్ బ్యాటరీతో ప్రోబ్లం ఉంది. కానీ, ఇది పేలిన సమయంలో చార్జింగ్ లో లేదు అని అతను చెప్పాడు.
ఇదిగో ఆ వీడియో మీకోసం..
This is the shocking moment a phone catches fire inside a man’s bag in China. pic.twitter.com/4C5zz8Ov6t
— SCMP News (@SCMPNews) April 20, 2021