Students on horse: స్కూల్ కి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే..! ఈ స్టూడెంట్స్ మరీ దారుణం.. వీడియో వైరల్.

|

Jan 29, 2023 | 8:41 AM

ఇదిగో ఈ విజువల్స్ కనిపిస్తన్న సీన్స్ లగ్జరీకోసం చేసింది కాదు. స్కూల్ కి వెళ్లాలంటే గత్యంతరం లేక తల్లిదండ్రుల సాయంలో పిల్లలు చేస్తున్న ప్రయోగం. కొండల్లో విసిరేసినట్లు ఉండే ఈ గ్రామంలో స్కూల్ కు వెళ్లాలంటే


ఇదిగో ఈ విజువల్స్ కనిపిస్తన్న సీన్స్ లగ్జరీకోసం చేసింది కాదు. స్కూల్ కి వెళ్లాలంటే గత్యంతరం లేక తల్లిదండ్రుల సాయంలో పిల్లలు చేస్తున్న ప్రయోగం. కొండల్లో విసిరేసినట్లు ఉండే ఈ గ్రామంలో స్కూల్ కు వెళ్లాలంటే పిల్లలు 5కిలోమీటర్లు కొండలు గుట్టలు దిగాల్సిన పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి మార్గాలు లేక నేటికీ అక్కడి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. తాము పడుతున్న కష్టం తమ పిల్లలు కూడా పడకూడదు. వారు బాగా చదువుకొని మంచి భవిష్యత్తును పొందాలని ఆశించారు. వారి తల్లిదండ్రులు గత్యంతరం లేక గుర్రాలపై పిల్లలను స్కూల్ కి తీసుకెళ్లి చదివిస్తున్నారు. అల్లూరి జిల్లా నేరేడుబంద గ్రామంలో స్కూల్ కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న కష్టం ఇది. అయితే తల్లిదండ్రులు లేని రోజు బడికి సెలవు పెడుతున్నారు. చదువుకు దూరం అవుతున్నారు. ఆ గిరిజనుల జీవితాలు తలరాతలుగా మారడం లేదు. మా మంచి గ్రామానికి రోడ్డు వేయండి మహాప్రభో అని వేడుకున్నా.. అధికారులు, అధికార పక్ష నాయకులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని ఆదివాసి గిరిజన వాసులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on