Viral Video: 95 ఏళ్ల వయసులో జీవన పోరాటం.. పొట్ట కూటి కోసం డ్రమ్స్‌ వాయిస్తూ.. చూస్తే కన్నీళ్లు ఆగవు.

Viral Video: 95 ఏళ్ల వయసులో జీవన పోరాటం.. పొట్ట కూటి కోసం డ్రమ్స్‌ వాయిస్తూ.. చూస్తే కన్నీళ్లు ఆగవు.

Anil kumar poka

|

Updated on: Jun 07, 2023 | 9:35 PM

వృద్ధాప్యం మనిషిని పూర్తి బలహీనుడిని చేస్తుంది. నిజానికి వృద్ధాప్యం పసితనంతో సమానం. ఈ వయసులో కన్నబిడ్డలు తల్లిదండ్రులకు అండగా నిలవాలి. వారిని పసిపిల్లల్లా చూసుకోవాలి. కానీ ఎంతోమంది వృద్ధులు ఆదరించేవారు లేక వృద్ధాశ్రమాలను, అనాధశరణాలయాలను ఆశ్రయిస్తుంటే, కొందరు మాత్రం తమను తాము పోషించుకోడానికి శరీరం సహకరించకపోయినా శక్తిని కూడదీసుకొని కష్టపడుతున్నారు.

ఈ వీడియోలో ఓ 95 ఏళ్ల వృద్ధుడు పొట్ట కూటికోసం మెడలో డప్పు వేసుకొని వాయిస్తున్నాడు. పెళ్లిలో ఓ మూల కూర్చుని శక్తిని కూడదీసుకొని డప్పు వాయిస్తున్న అతన్ని చూస్తే కన్నీళ్లు ఆగవు. డప్పు వాయిస్తున్న అతను మధ్యలో అలసిపోయి నేలపై కూర్చుండిపోతున్నాడు. 95 ఏళ్ల వయసులోనూ ఆ వృద్ధుడు ఎవరిపైనా ఆధారపడకుండా తనకున్న కళను ఉపాధిగా మలచుకొని పొట్టపోసుకుంటున్నాడు. ఈ తాతగారు నిరాశతో బ్రతుకుతున్న ఎందరో వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. ఈ వీడియోను పాండే రిత్విక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఈ తాతగారు గుజరాత్‌కు చెందినవారని, తనుకూడా గుజరాత్‌కు చెందినవాడినేనని తెలిపాడు రిత్విక్‌. అంతేకాదు ఆ తాతగారు ఇస్లాం అనుచరుడని తెలిపాడు. ఈ తాతగారికి చేయూతనిచ్చేందుకు ఎందలో ముందుకొస్తున్నారని కూడా తెలిపాడు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 18 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 28 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. 33 వేలమంది కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.