Strange Judgment: భార్య భర్తల కేసులో కోర్టు వింత పనిష్మెంట్‌.. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు బర్గర్లు పంచమన్న కోర్టు.

|

Oct 10, 2022 | 9:19 PM

వ్యక్తిగత కారాణాలతో విడిపోయిన ఓ జంటకు కోర్టు వింత పనిష్మెంట్ ఇచ్చింది. ఈ కేసులో భర్తను బర్గర్లు పంచాలని, భార్య నాలుగున్నర లక్షల రూపాయలను ఫైన్‌ కట్టాలని ఆదేశించింది.


ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి పర్సనల్‌ కారణాలతో తన భార్యకు విడాకులు ఇచ్చి, అతరె మరో వివాహం చేసుకున్నాడు. అయితే మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య 2020లో కోర్టుకు వెళ్లింది. తాను, తన భర్త వైవాహిక బంధంలో ఉన్నప్పుడు భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించాడని ఫిర్యాదు చేసింది. దీనిపై రెండేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవల ఈ భార్యభర్తలు రాజీకి వచ్చారు. న్యూఢిల్లీ సాకేత్‌ కోర్టులో మాజీ భర్తపై కేసు వెనక్కి తీసుకునేందుకు భార్య అంగీకరించింది. కాగా జస్టిస్‌ సింగ్‌ ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మాజీ భార్యాభర్తలు ఎంతో విలువైన కోర్టు సమయాన్ని, పోలీసుల సమయాన్ని వృథాచేశారన్నారు. అందుకు ప్రతిగా వారు సమాజానికి పనికివచ్చే చర్యలు చేయాలని ఆదేశించారు. మయూర్‌ విహార్‌ ప్రాంతంలో బర్గర్‌ సింగ్‌, వాట్‌ ఏ బర్గర్‌ పేరుతో సదరు భర్తకు రెస్టారెంట్లు ఉన్నాయి. దాంతో సదరు మాజీ భర్తను ఏవైనా రెండు అనాధాశ్రమాల్లో కనీసం వంద మందికిపైగా అనాథలకు బర్గర్ లను ఉచితంగా అందించాలని ఆదేశించింది కోర్టు. పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని సూచించింది. అటు మాజీ భార్యకూ శిక్ష విధిస్తూ 4 లక్షల 50 వేల రూపాయలను కోర్టుకు పరిహారంగా చెల్లించాలని.. అదికూడా మాజీ భర్త బర్గర్లు పంచే రోజునే చెల్లించాలని ఆదేశించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Follow us on