పిట్ట బావుందని ముట్టుకున్నారో అంతే సంగతులు.. క్షణాల్లో మృతి
కిలకిలా రావాలతో అలరించే పక్షులంటే ఎవరికి ఇష్టముండదు. బుల్లి బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకుంటుంటారు చాలామంది. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ గూటిలో అవి అటూ ఇటూ ఎగురుతూ ఉంటే ఎంతో ముచ్చటపడుతుంటారు. కానీ పక్షుల్లో కొన్ని డేంజర్ పక్షులు ఉంటాయన్న సంగతి మీకు తెలుసా..
కిలకిలా రావాలతో అలరించే పక్షులంటే ఎవరికి ఇష్టముండదు. బుల్లి బుల్లి పిట్టలను ఇంట్లో పెంచుకుంటుంటారు చాలామంది. పిట్టలకు ఆహారం, నీరు అందిస్తూ గూటిలో అవి అటూ ఇటూ ఎగురుతూ ఉంటే ఎంతో ముచ్చటపడుతుంటారు. కానీ పక్షుల్లో కొన్ని డేంజర్ పక్షులు ఉంటాయన్న సంగతి మీకు తెలుసా.. ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు హరించేస్తాయి. అలాంటి భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. వాటిని ఇళ్లలో పెంచుకోవడం కాదు కదా వాటి సమీపానికి వెళ్లడం కూడా ప్రమాదమే అంటున్నారు. ఈ డేంజర్ పక్షులు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయట. ఇవి అడవుల్లో ఉండే విషపూరిత ఫలాలు, పదార్ధాలను ఆరగించి వాటిని న్యూరోటాక్సిన్లుగా మార్చి, తమ రెక్కల్లో నిల్వ చేసుకుంటాయట. విషాన్ని తట్టుకునే సామర్థ్యం ఈ పక్షుల్లో ఉందట. కాలానుగుణంగా వాటి శరీరంలో సంభవించిన జన్యుపరమైన మార్పులే ఇందుకు కారణమని డెన్మార్క్‌లోని నేచురల్ హస్టరీ మ్యూజియం ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇటీవల న్యూగినియా అడవుల్లో పర్యటనకు వెళ్లినప్పుడు ఈ పక్షులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విడాకుల సెలబ్రేషన్స్.. పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు
ఎల్లుండి RRR టీమ్‌తో అమిత్‌షా తేనీటి విందు
Ram Pothineni: పూరీ ఈజ్ బ్యాక్.. ఇస్మార్ట్ రాపోతో ఫిల్మ్
Pushpa 2: పుష్ప రాజ్ వేటలోజగపతి బాబు.. క్లారిటీ ఇచ్చిన నటుడు
Adipurush: హాలీవుడ్‌ను దద్దరిల్లేలా చేస్తున్న ఆదిపురుష్ టీజర్