42 ఏళ్లు బందీగా .. ఉద్యోగం కోసం వెళ్లి..చివరికి వీడియో

Updated on: May 04, 2025 | 5:08 PM

చక్కటి ఉద్యోగం,మంచి జీతం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనలో పొట్టచేత పట్టుకొని వెళ్లాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. చివరికి అక్కడినుంచి ఎలా బైటపడ్డాడు? కుటుంబాన్ని ఎలా కలుసుకున్నాడు? ఈ హృదయ విదారక గాథకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం రండి! కేరళలోని త్రివేండ్రం జిల్లా పౌడికోణంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న గోపాలన్ గల్ఫ్‌ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి, కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు.

ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. 1983 ఆగస్టు 16న బహ్రెయిన్‌కు వెళ్లాడు. కానీ విధి రాత మరోలా ఉంది. గోపాలన్‌ బహ్రెయిన్‌కు చేరుకున్నాడో లేదో, అతని యజమాని అకాల మరణం చెందాడు. గోపాలన్‌ పాస్‌పోర్ట్ పోయింది. దాంతో గోపాలన్‌ అయోమయంలో పడిపోయాడు. ఇమ్మిగ్రేషన్ చిక్కులతో బహ్రెయిన్‌లో చిక్కుకు పోయాడు. నాలుగు గోడల మధ్య మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు. అయితే ప్రవాసీ లీగల్ సెల్ అనే NGO అతని పాలిట వరంగా మారింది. విదేశాలలో అన్యాయాన్నిఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు , జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న ఎన్జీవో, గోపాలన్‌ విషయం తెలుసుకుని అతనికి సాయపడింది. పీఎల్‌సీ బహ్రెయిన్ చాప్టర్ ప్రెసిడెంట్ సుధీర్ తిరునిలత్, తన బృందంతో కలిసి బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమ్మిగ్రేషన్ తో సమన్వయం చేసుకుని, అష్టకష్టాలు పడి చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

మనవడితో మహిళ జంప్‌.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..

సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు