పరీక్ష రాయాలంటే మంగళసూత్రం తీసేయాలా?వీడియో
కర్ణాటకలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళసూత్రం సహా ఎలాంటి ఆభరణాలతో వచ్చినా పరీక్ష హాల్ లోకి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఈమేరకు నియామక పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ పై స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వివాదాస్పద నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. వివాహిత స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని తొలగించాలనడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీహెచ్ పీతో పాటు పలు హిందూ సంస్థలు సైతం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి.
హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో చివరకు రైల్వే అధికారులు వెనక్కి తగ్గి, ఆ వివాదాస్పద నిబంధనను తొలగించారు.రైల్వే శాఖలో నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు హాల్ టికెట్లు కూడా పంపించారు. అయితే, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళసూత్రం, చెవిపోగులు, ముక్కుపుడకలు, ఉంగరాలు, కంకణాలు, జంధ్యం వంటివి ఏవీ ధరించకూడదని హాల్‌టికెట్లపై పేర్కొన్నారు. దీనిపై వీహెచ్ పీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మనవడితో మహిళ జంప్.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..
సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

