AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో పిల్లల కోసం తల్లి ఆరాటం వీడియో

సరిహద్దులో పిల్లల కోసం తల్లి ఆరాటం వీడియో

Samatha J

|

Updated on: May 04, 2025 | 5:07 PM

అటారీ సరిహద్దు వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలకు దూరమై ఓ తల్లి పడుతున్న వేదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. పాకిస్థాన్‌లోని తన కుటుంబం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రుఖ్సార్ అనే మహిళకు నిరాశే ఎదురైంది. పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా ఆమెను అధికారులు సరిహద్దు వద్ద నిలిపివేయగా, ఆమె నలుగురు పిల్లలు మాత్రం పాకిస్థాన్ చేరుకున్నారు. దీంతో తన బిడ్డలకు దూరమై రుఖ్సార్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రుఖ్సార్ భారత పౌరురాలు కాగా, ఆమె భర్త, నలుగురు పిల్లలు పాకిస్థాన్ పౌరులు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రుఖ్సార్ ఇటీవల ఢిల్లీలోని తన తల్లిని చూసేందుకు భారత్ వచ్చారు.

తిరిగి పాకిస్థాన్‌లోని తన పిల్లలు, భర్త వద్దకు వెళ్లేందుకు అటారీ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే, రుఖ్సార్ వద్ద భారత పాస్‌పోర్ట్ ఉండగా, ఆమె పిల్లల వద్ద పాకిస్థానీ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఈ కారణంగా, పాక్ అధికారులు పిల్లలను వారి తండ్రితో పాటు తమ దేశంలోకి అనుమతించారు కానీ, భారత పాస్‌పోర్ట్ ఉన్న రుఖ్సార్ ప్రవేశానికి మాత్రం నిరాకరించారు. దీంతో తన నలుగురు పిల్లలు, ముఖ్యంగా మూడేళ్ల చిన్న కుమార్తెకు దూరంగా రుఖ్సార్ సరిహద్దు వద్దే నిలిచిపోవాల్సి వచ్చింది. కళ్లముందే పిల్లలు పాకిస్థాన్ వెళ్లిపోవడం, తాను మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా ఆమె..తనకు నలుగురు పిల్లలు అని, చిన్న పాప వయసు కేవలం మూడేళ్లేనని చెప్పారు. పిల్లలంతా వాళ్ల నాన్నతో కలిసి పాకిస్థాన్ వెళ్లిపోయారని, తాను లేకుండా తన బిడ్డలు ఎలా ఉండగలరు? వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పదమూడేళ్ల తర్వాత తప తల్లిని చూడ్డానికి వచ్చానని, ఇలా సరిహద్దులో చిక్కుకుపోయానని వాపోయారు. తన పిల్లలు పాకిస్థాన్‌లో ఉన్నారని, వారికి దూరంగా ఉండలేనని, దయచేసి తనను తన పిల్లల వద్దకు, పంపించాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

మనవడితో మహిళ జంప్‌.. వయసులో ఉన్న మనవళ్లు ఉంటే..మీ భార్యలు జాగ్రత్త!

మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..! కాబోయే అల్లుడితో మరో అత్త జంప్..

సరిగ్గా దండలు మార్చుకునే టైంకి..పెళ్లి కొడుకు ఫేస్ చూసి బిత్తరపోయిన వధువు