రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!

రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!

Phani CH

|

Updated on: Mar 25, 2023 | 9:57 AM

మెదక్‌ జిల్లా రామాయంపేటలో చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నిబడిన మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మెదక్‌ జిల్లా రామాయంపేటలో చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నిబడిన మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రామాయం పేట మండలం సుత్తార్‌పల్లికి చెందిన రాగి రాజమణి అనే మహిళ భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్తున్నారు. దారిలో స్థానికి ఎస్బీఐ బ్యాంక్‌లో నగదు డ్రా చేసుకునేందుకు భర్త బ్యాంకులోపలికి వెళ్లగా.. మహిళ బ్యాంకుముందు తమ వాహనం వద్ద నిలబడి ఉంది. ఇంతలో హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ పక్కనే కాసేపు నిలబడి, ఏదో సరిచేసుకుంటున్నట్లు నటిస్తూ.. ఒక్కసారిగా మహిళ మెడలోని మూడు తులాల గొలుసు లాక్కొని పారిపోయారు. ఈ పెనుగులాటలో మహిళ ముందుకు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మహిళను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటే ట్యాలెంట్‌.. కరెంట్‌ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు

వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్‌ రూపంలో !!

‘నువ్వు వర్జిన్​వేనా’.. లైవ్‌ చాటింగ్‌లో ఆన్సర్ !!

చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో

మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్

 

Published on: Mar 25, 2023 09:57 AM