Sunita Williams: ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?

Sunita Williams: ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?

Anil kumar poka

|

Updated on: Jul 15, 2024 | 11:41 AM

నేను క్షేమంగానే ఉన్నా... నా మనస్ఫూర్తిగా చెబుతున్నా. నేను సంతోషంగానే ఉన్నా. మా స్పేస్ క్రాఫ్ట్ త్వరలోనే మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా... ఇది బుధవారం నాసా నిర్వహించిన లైవ్ కాన్ఫెరెన్స్‌లో సునితా విలియమ్స్ చెప్పిన మాట. నిజానికి ఆ వీడియోనే మీకు చూపిద్దామనుకున్నా.. ఆమె మాటల్ని స్వయంగా వినిపిద్దామనుకున్నా.. బట్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల మీకు చూపించలేకపోతున్నా.

నేను క్షేమంగానే ఉన్నా… నా మనస్ఫూర్తిగా చెబుతున్నా. నేను సంతోషంగానే ఉన్నా. మా స్పేస్ క్రాఫ్ట్ త్వరలోనే మమ్మల్ని మా ఇంటికి సురక్షితంగా చేరుస్తుందని బలంగా నమ్ముతున్నా… ఇది బుధవారం నాసా నిర్వహించిన లైవ్ కాన్ఫెరెన్స్‌లో సునితా విలియమ్స్ చెప్పిన మాట. నిజానికి ఆ వీడియోనే మీకు చూపిద్దామనుకున్నా… ఆమె మాటల్ని స్వయంగా వినిపిద్దామనుకున్నా.. బట్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల మీకు చూపించలేకపోతున్నా. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి సునీత, ఆమె స్పేస్ జర్నీ సహచరుడు విల్ మోర్ వెళ్లిన సుమారు 5 వారాల తర్వాత నాసా నిర్వహించిన ఫస్ట్ న్యూస్ కాన్ఫెరెన్స్ ఇది.

అటు విల్ మోర్ కూడా తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఫెల్యూర్ ఈజ్ నా ఏన్ ఆప్షన్ .. అని కోట్ చేసిన విల్ మోర్ త్వరలోనే భూమిని చేరుతామన్నారు. ప్రస్తుతం యూఎస్ స్పేస్ ఏజెన్సీ, బోయింగ్ సంయుక్తంగా భూమిపై నిర్వహిస్తున్న త్రస్టర్ టెస్టులు తమ పునరాగమనంలో కీలక పాత్ర పోషిస్తాయని విల్ మోర్ వ్యాఖ్యానించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే వీలైనంత త్వరలోనే ఈ సమస్యనుంచి బయటపడి భూమికి చేరుతామని సునితా, విల్ మోర్ ఇద్దరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. వారి సంగతి సరే… మరి నాసా ఏం చెబుతోంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు బోయింగ్ ఏం ప్లాన్లు వేస్తోంది. ఏదైనా డెడ్ లైన్ పెట్టుకుందా..? అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో జూన్ నెలాఖరుకు, జూలై మొదటి వారం అని చెప్పుకుంటూ వచ్చినట్టు ఇప్పుడు కూడా జూలై నెలాఖరు నాటికి వారికి తిరిగి రప్పించగలమని భావిస్తున్నారు. కానీ ఆ విషయం కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎన్డీటీవీ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ మిషన్‌ను 45 నుంచి 90 రోజుల వరకు పొడిగించే అవకాశం ఉన్నట్టు యూఎస్ స్పేస్ ఏజెన్సీ హింట్ ఇచ్చిందని తెలుస్తోంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.