SQuirrel: ఇది మామూలు ఉడత కాదురోయ్‌.. ఆ విషయంలో దీన్ని ఫాలో అవ్వాల్సిందే..!

|

Jul 20, 2022 | 6:04 PM

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం అని అనేక సందర్భాల్లో వింటుంటాం. అందుకే, వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు నిపుణులు.


ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం అని అనేక సందర్భాల్లో వింటుంటాం. అందుకే, వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మార్నింగ్ వాక్, వ్యాయామాం, జిమ్‌కి వెళ్లడం, యోగా చేయడం వంటివి చేస్తుంటారు. తద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటారు. అయితే, ఆరోగ్యంగా ఉండటం మనుషులకే కాదు.. జంతువులకూ అవసరమే అని చెబుతోంది ఓ చిట్టి ఉడుత. అవునండీ.. ఆ ఉడుత తన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఉదయాన్నే లేచి యోగాసనాలు వేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ ఉడుత సూర్యోదయం వేళ మ్యాట్‌పై పడుకుని తన ముందరి కాళ్లు, వెనుక కాళ్లు బారుగా చాచి యోగాసనాలు వేస్తోంది. రకరకాల ఆసనాలతో ఆకట్టుకుంటోంది. అయితే, ఉడుత యోగాసనాలను దాని యజమాని వీడియోలో బంధించాడు. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది. ఉడుత ఆసనాలను చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. గంటల వ్యవధిలోనే మిలియన్ల మంది వీక్షించగా వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ ఉడుతను చూసి చాలా నేర్చుకోవాలంటున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 20, 2022 06:04 PM