Spider Woman: పిల్ల కాదు ? చిచ్చర పిడుగు..! స్పైడర్‌ ఉమెన్‌ను మించిపోయింది..

Spider Woman: పిల్ల కాదు ? చిచ్చర పిడుగు..! స్పైడర్‌ ఉమెన్‌ను మించిపోయింది..

Anil kumar poka

|

Updated on: Apr 15, 2022 | 9:46 PM

స్పైడర్ మ్యాన్ సినిమా అందరికీ తెలుసు..అందులో హీరో ఎటువంటి సహాయం లేకుండా భవనాలపైకి ఎక్కితే కళ్లు ఆర్పకుండా చూశాం. అది సినిమాలోనే సాధ్యం అనుకుని ఊరుకున్నాం. అయితే, ఇక్కడో ఐదేళ్ల చిన్నారి స్పైడర్ ఉమెన్‌లా చెట్లు, గోడలు బరాబరా ఎక్కేస్తోంది.


స్పైడర్ మ్యాన్ సినిమా అందరికీ తెలుసు..అందులో హీరో ఎటువంటి సహాయం లేకుండా భవనాలపైకి ఎక్కితే కళ్లు ఆర్పకుండా చూశాం. అది సినిమాలోనే సాధ్యం అనుకుని ఊరుకున్నాం. అయితే, ఇక్కడో ఐదేళ్ల చిన్నారి స్పైడర్ ఉమెన్‌లా చెట్లు, గోడలు బరాబరా ఎక్కేస్తోంది.అదేదో అలవాటు ఉన్నట్టు, ప్రత్యేకించి శిక్షణ పొందినట్టు ఈ చిన్నారి 20 అడుగుల పైకి తాడు సహాయంతో, అవలీలగా వాయువేగంతో అమాంతం పైకి ఎక్కేస్తోంది.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నివాసం ఉంటున్న రాజేష్,రోజా లు ఒక చిన్న టి బాంక్, కర్రీస్ పాయింట్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ పట్టణంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. పెద్ద పాప రేణుకశ్రీ రెండో తరగతి, రెండో పాప తాన్యశ్రీ యూకేజీ చదువుతుంది. ఒకరోజు ఇంట్లో పిల్లకోసం కోసం దాదాపు 20 అడుగుల పైన చెట్టుకు తాడు కట్టారు. దీంతో వీరి రెండో అమ్మాయి తాన్యశ్రీ ఐదు సంవత్సరాలు ఉన్న బాలిక తన మనసులో తాడు ఎక్కలనిపించింది. ఇంకా నిమిషం ఆలస్యం చేయకుండా ఇంట్లో ఎవరూ లేని టైమ్‌ చూసుకుని తానొక్కతే, చెట్టుకు కట్టిన తాడు ఎక్కుతూ ఉండేది. ఇది గమనించిన తల్లిదండ్రులు అలా ఎక్కితే కింద పడతావు అని మందలించారు. అయినా కూడా వినకుండా తాను మాత్రం తాడు ఎక్కే ప్రయత్నం చేస్తూనే ఉండేది. చివరకు ఆ చిన్నారి ప్రయత్నం ఫలించి తాను 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టును తాడు సహాయంతో అవలీలగా ఎక్కేస్తూ అందరిని ఔరా అనిపిస్తుంది. అయితే తనకు ఎవరూ నేర్పక పోయిన సొంతగా 20 అడుగుల పైకి తాడు, చెట్టు,స్తంభం వంటివి వాయువేగంతో ఎక్కుతూ.. అందరి మన్ననలు పొందుతుంది. తనకు ఇంకా ప్రోత్సాహం కల్పిస్తే..ఎంత ఎత్తైన ఎక్కగలదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!