Insurance policy: గృహిణులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీ.. ఈ భీమా పొందాలంటే ఎం కావాలో ఈ వీడియోలో చూడండి..
ఇప్పటివరకూ గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పాలసీబజార్‌తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణులకోసం దేశంలో మొదటిసారి మహిళలకోసం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం.
Special insurance policy for housewives: ఇప్పటివరకూ గృహిణులకు ప్రత్యేక బీమా అనేది అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. పాలసీబజార్‌తో కలిసి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ అనే కొత్త బీమా పాలసీని ప్రకటించింది. గృహిణులకోసం దేశంలో మొదటిసారి మహిళలకోసం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం. ఇప్పటి వరకు గృహిణుల జీవిత బీమా భర్తకు కూడా వర్తిస్తుంది. చాలా బీమా కంపెనీల్లో భర్త బీమా కవరేజీలో భార్యలకు 50 శాతం మాత్రమే లభిస్తోంది. భర్తకు వచ్చే ఆదాయం పెద్దగా లేకుంటే తక్కువ ఖర్చుతో కూడిన కవర్ తీసుకుంటే అందులో సగం మొత్తాన్ని భార్యకు అందజేస్తారు. చిన్న కవర్‌తో బీమా ఎంపిక అందుబాటులో లేదు. ఒక వ్యక్తి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు అయితే.. అతని ఆదాయానికి 20 రెట్లు బీమా కవరేజ్ పొందవచ్చు. ఒకవేళ భర్త కోటి రూపాయల కవర్ పాలసీ తీసుకుంటే.. భార్యకు అసలు బీమా మొత్తం మిగలదు. ఒకవేళ భర్త కోటి కంటే తక్కువ 75 లక్షల రూపాయల బీమా కవర్ భర్త తీసుకుంటే.. అప్పుడు భార్య దాదాపు 25 లక్షల రూపాయల వరకు బీమాను పొందవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెట్ లో 25 లక్షల రూపాయల మెుత్తానికి కవరేజ్ అందించే ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అందుబాటులో లేవు.మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ జీవిత భాగస్వామికి పాలసీ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా గృహిణులకు ప్రత్యేక టర్మ్ కవరేజ్ పాలసీలను అందిస్తోంది. ఈ పాలసీ కింద గృహిణులకు 49.99 లక్షల రూపాయల వరకు పాలసీని ఇస్తుంది. బీమాదారుని వయసు, బీమా కాల వ్యవధిని బట్టి చెల్లించవలసిన ప్రీమియం 10 వేల నుంచి 12 వేల మధ్య ప్రారంభమౌతుంది. కరోనా సమయంలో చాలా కుటుంబాలు వారి ఇంట్లో గృహిణులను కోల్పోయాయి. దాని కారణంగా వారి కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయని పాలసీ బజార్ సంస్థ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ప్రవీణ్ చౌదరి అన్నారు. గృహిణులకు బీమా కవరేజ్ చాలా బాగుంది. కానీ.. ఈ బీమా పాలసీలోని రెండు ముఖ్యమైన షరతులు దానిని ఎక్కవ మందికి అందకుండా చేస్తున్నాయి. అవేమిటంటే.. గృహిణి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలనేది మొదటి షరతు, రెండో షరతు కుటుంబ వార్షికాదాయం 5 లక్షల రూపాయలకు పైబడి ఉంటేనే ఈ బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. అంటే.. తక్కువ చదువుకున్న గృహిణులు, తక్కువ ఆదాయ కుటుంబాలు ఈ బీమా పరిధిలోకి రావు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..