Dog Ice Cream: అబ్బా..! కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్.. శునకాలే డెలివరీ.. ఎక్కడంటే..

Dog Ice Cream: అబ్బా..! కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్.. శునకాలే డెలివరీ.. ఎక్కడంటే..

Anil kumar poka

|

Updated on: Jun 20, 2022 | 6:03 PM

పెంపుడు జంతువులలో కుక్కలది ప్రత్యేక స్థానం. అత్యంత విశ్వాసం గల కుక్కలని కొంత తమంది మనుషుల కంటే ఎక్కువగా భావిస్తారు. పెంపుడు కుక్కలకు పెట్టే ఫుడ్‌ విషయంలో కూడా స్పెషల్ కేర్‌ తీసుకుంటారు. వాటి కోసం ప్రత్యేకమైన ఫుడ్‌


పెంపుడు జంతువులలో కుక్కలది ప్రత్యేక స్థానం. అత్యంత విశ్వాసం గల కుక్కలని కొంత తమంది మనుషుల కంటే ఎక్కువగా భావిస్తారు. పెంపుడు కుక్కలకు పెట్టే ఫుడ్‌ విషయంలో కూడా స్పెషల్ కేర్‌ తీసుకుంటారు. వాటి కోసం ప్రత్యేకమైన ఫుడ్‌ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో ఓ బ్రిటీష్ సూపర్ మార్కెట్ కుక్కల కోసం ప్రత్యేక ఐస్ క్రీమ్ ను తయారు చేసింది.సాధారణంగా మనుషులు వేసవి కాలంలో చల్ల-చల్లని ఐస్ క్రీం తింటూ కొంత ఉపశమనం పొందటానికి ప్రయత్నిస్తారు. అయితే జంతువుల సంగతి ఏమిటి. అవి కూడా వేడి తాపాన్ని అనుభవిస్తాయి. కనుక వాటికి కూడా కొంత ఉపశమనం కలిగించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు. ఈ ఆలోచనతో UK సూపర్ మార్కెట్ చైన్ ఆల్ డి వెనిల్లా, ఆపిల్ ఫ్లేవర్లలో ఐస్ క్రీంను విడుదల చేసింది.ఈ ఐస్‌క్రీమ్‌ ధర 300 రూపాయల వరకూ ఉంటుంది. ప్రస్తుతం వెనిల్లా, ఆపిల్ ప్లేవర్స్‌తో రెండు రకాల ఐస్‌క్రీమ్‌ తయారు చేసారు. మెట్రో అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఈ ఐస్‌క్రీం నాలుగు డబ్బాల ధర దాదాపు 300 రూపాయలు. ఒక్కో క్యాన్‌లో 110 ml ఐస్‌క్రీం ఉంటుంది. ఈ ఐస్‌క్రీమ్‌ను విక్రయించడానికి యూకే సూపర్ మార్కెట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐస్‌క్రీమ్ షాప్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో కుక్కలకు స్పెషల్ ఐస్ క్రీమ్ కొనాలనుకునే వారికి సులభంగా అందుబాటులో ఉంటుంది. మరో స్పెషాలిటీ ఏమిటంటే.. కుక్కలు స్వయంగా ఐస్ క్రీం డెలివరీ చేస్తున్నాయి. ప్రత్యేక జాకెట్ ధరించి.. ఇతర కుక్కలకు ఐస్ క్రీం డెలివరీ చేస్తున్నాయి శునకాలు. అందుకే ఈ సేవకు ‘డాగ్-లివరీ'(dog-livery) అని పేరు పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..