Shocking Video: సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా ఏం జరిగిందో చూస్తే వెన్నులో వణుకే..
రోడ్డుపైన మీదారిన మీరు వెళ్తున్నారు... రోడ్డు పక్కనే పార్క్.. పచ్చని చెట్లతో చల్లగా గాలి వీస్తుంటే ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే.. ఊహించని విధంగా క్రూర మృగం మీపై దాడిచేస్తే ఎలా ఉంటుంది.
రోడ్డుపైన మీదారిన మీరు వెళ్తున్నారు… రోడ్డు పక్కనే పార్క్.. పచ్చని చెట్లతో చల్లగా గాలి వీస్తుంటే ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే.. ఊహించని విధంగా క్రూర మృగం మీపై దాడిచేస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ. అసోంలో ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. కజిరంగా నేషనల్ పార్కులోని హల్దీబాడీ జంతు కారిడార్ వద్ద ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తిపై పొదల్లోంచి దూకి ఒక్కసారిగా మెరుపు దాడి చేసింది ఓ చిరుతపులి. దీంతో అతను సైకిల్‌పై నుంచి కిందపడ్డాడు. అయితే రోడ్డుపై వాహనాల సంచారం ఉండటంతో.. ఆ చిరుత అతన్ని ఏం చేయకుండా మళ్లీ పొదల్లోకి వెళ్లిపోయింది. అదృష్టం కొద్దీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు పార్క్ సమీపంలో ఆగవద్దని కజిరంగా నేషనల్ పార్క్‌లో పనిచేస్తున్న రమేష్ కుమార్ గొగోయ్ కోరారు. అడవి జంతువులు తరచుగా రహదారికి సమీపంలో తిరుగుతున్నందున సైక్లిస్టులు, ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

