SpaceX Rocket: గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి చేరిన శాటిలైట్లు​!

|

Jul 16, 2024 | 6:29 PM

అపర కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఫెయిలైంది. దీంతో గురువారం రాత్రి ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీకవడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది.

అపర కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఫెయిలైంది. దీంతో గురువారం రాత్రి ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీకవడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ఫాల్కన్ 9 రాకెట్ ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన వెంటనే తమ కంపెనీ ఫ్లైట్ కంట్రోలర్లు దానిలోని దాదాపు సగం ఉపగ్రహాలతో కనెక్టయ్యారని స్పేస్ ఎక్స్ తెలిపింది. వాటిలోని అయాన్ థ్రస్టర్లను ఉపయోగించి శాటిలైట్లను ఎగువ కక్ష్యలోకి పంపేందుకు యత్నించినా సాధ్యపడలేదని చెప్పింది. తప్పుడు కక్ష్యలోకి చేరిన శాటిలైట్లు గాల్లోనే కాలిపోతాయని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on