Sonu Sood: నాపేరు చెప్పండి.. డిస్కౌంట్ పొందండి..! బేరమాడి చెప్పులు కొన్న సోనూసూద్

| Edited By: Ravi Kiran

Aug 07, 2021 | 6:43 AM

నటుడు సోనూసూద్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. అలాగే ఎంతో మందికి సహాయం చేస్తూ అండగా నిలిస్తున్నాడు. ఈ మధ్య వీధి వ్యాపారులకు మద్దుతు తెలుపుతూ... వారి వ్యాపారానికి సహాయపడాలంటూ కోరడం తెలిసిన సంగతే.

Sonu Sood: నాపేరు చెప్పండి.. డిస్కౌంట్ పొందండి..! బేరమాడి చెప్పులు కొన్న సోనూసూద్
Sonu Sood
Follow us on

Viral Video: నటుడు సోనూసూద్ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. అలాగే ఎంతో మందికి సహాయం చేస్తూ అండగా నిలిస్తున్నాడు. వీధి వ్యాపారులకు మద్దుతు తెలుపుతూ… వారి వ్యాపారానికి సహాయపడాలంటూ కోరడం తెలిసిన సంగతే. తాజాగా వీధి వ్యాపారుల చెంత చెప్పులు కొన్న ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ వీడియోను సోనూసూద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఏమందంటే.. సినిమా షూటింగ్‌ కోసం జమ్మూ-కశ్మీర్‌ వెళ్లిన సోనూసూద్… అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి చెంతకు వెళ్లి చెప్పులు కొన్నాడు. అదికూడా బేరమాడి మరీ కొన్నాడు. ముందుగా ఓ జత చెప్పులు తీసుకున్న సోనూసూద్.. వాటి ధరను వ్యాపారిని అడిగి తెలుసుకున్నాడు. కొంత డిస్కౌంట్‌ ఇవ్వమంటూ వ్యాపారిని కోరాడు. ఈ వ్యాపారి 20 శాతం డిస్కౌంట్ ఇస్తానంటూ తెలిపాడు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ, చెప్పులు కొనాలనుకుంటే.. షమీమ్‌ షాపు వద్దకు రండి. నా పేరు చెప్పి డిస్కౌంట్‌ కూడా పొందండి అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీధి వ్యాపారిని సపోర్ట్‌ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే నటుడు సోనూసూద్ చేసిన పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీధి వ్యాపారులకు అండగా నిలిచిన సోనూసూద్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరోనా లాక్‌డౌన సమయంలోనూ ఎంతోమందికి అండగా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నాడు. ఈ నటుడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ లో కీలక పాత్ర పోషిస్తున్నసంగతి తెలిసిందే.

Also Read: Tokyo Olympics 2020: రెఫరీపై దాడి.. భారత రెజ్లర్ దీపక్ పునియా కోచ్‌పై వేటు.. డబ్ల్యూఎఫ్‌ఐని హెచ్చరించిన ఐవోసీ

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో నేడే భారత్‌కు చివరిరోజు.. పతకాల సంఖ్య పెరిగేనా? భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్