ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు.. తండ్రి ఏం చేశాడో తెలుసా.?

|

Dec 16, 2024 | 10:23 AM

తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులు కావాలి కానీ.. తల్లిదండ్రులు మాత్రం మాకు అక్కర్లేదు అన్నట్టుగా తయారవుతున్నారు కొందరు ప్రబుద్ధులు. జన్మనిచ్చి, పెంచి పోషించిన తల్లిదండ్రులను రోడ్డుపాలుచేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా ఇలాంటిదే మరో ఘటన మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే తనను పట్టించుకోని కొడుకు తిక్క కుదిర్చాడు ఆ తండ్రి. తన ఆస్తిని తనకు తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు.

మెదక్ జిల్లా రెగోడ్ మండలానికి చెందిన ఏనుకత్తల సంగమేశ్వర రెడ్డి వయసు 77 సంవత్సరాలు.. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు విట్టల్ రెడ్డి అనారోగ్యంతో మరణించాడు. కాగా చిన్న కుమారుడు మహిపాల్ రెడ్డి పేరు మీద ఒక ఎకరం మూడు గంటల భూమిని 1987లో తండ్రి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చాడు.. సంగమేశ్వర్ రెడ్డి వృద్ధుడు అయినప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా తన కొడుకు ఆస్తి తీసుకొని కూడా తనను పట్టించుకోవడంలేదనీ, తన అస్థిని తనకు తిరిగి ఇవ్వాలని 2023 సంవత్సరంలో మెదక్ జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో విన్నవించు కున్నాడు. ఈ క్రమంలో కలెక్టర్‌.. తండ్రిబాగోగులు చూడడం లేదు కనుక తన పోషణ కోసం కనీసం నెలకు ఐదు వేలు ఇవ్వమని కలెక్టర్ మహిపాల్‌ రెడ్డికి చెప్పారు. అయిన అతను ససేమిరా అనడంతో, తన భూమి తనకు తిరిగి ఇప్పించాలని తండ్రి కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో కలెక్టర్ చొరవ తీసుకొని సంబంధిత ఆర్డీవో,తాసిల్దార్లకు చెప్పగా వీరు ఇరువురు కలిసి వృద్ధునికి 2007 సీనియర్ సిటిజన్ ఆక్ట్ కింద తండ్రి ఇచ్చిన భూమిని,తిరిగి వృద్ధుని పేరు మీద భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. తమ భూమి తమకు దక్కడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.