అమ్మకు ప్రేమతో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
తల్లి పిల్లలపై చూపించే ప్రేమ గురించి, కుటుంబం కోసం అమ్మ పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమ పిల్లల అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది అమ్మ.
తల్లి పిల్లలపై చూపించే ప్రేమ గురించి, కుటుంబం కోసం అమ్మ పడే తపన గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమ పిల్లల అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది అమ్మ. అటువంటి అమ్మ ప్రేమని త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న పిల్లలు.. తల్లి సంతోషంగా ఉండేలా చూస్తారు. తమ తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి వారి కోరికలు, కలలన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఇలాంటి అందమైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో విలాసవంతమైన కారులో డ్రైవింగ్ సీటులో ఓ మహిళ కూర్చొని ఉంది. కొడుకుతో మాట్లాడుతూ కారు నడుపుతోంది. ఆ సమయంలో ఆ మహిళ ఎంతో సంతోషంగా ఉంది. ఆమె చిరునవ్వు నెటిజన్ల మనసును దోచుకుంది. మహిళ డ్రైవింగ్ చేస్తోన్న తీరు.. ఆమె డ్రైవింగ్ నైపుణ్యం చూస్తుంటే.. ఆమెకు కారు డ్రైవింగ్ లో మంచి అనుభవం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె కొడుకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘మా అమ్మ ఎక్స్‌యూవీ700 డ్రైవింగ్ చేస్తోంది’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. లక్షలమంది ఈ వీడియోను వీక్షిస్తూ లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

