Sohna – Mohna: ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.
ఆ ఇద్దరిదీ ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే. మన వీణా వాణిలాగా పంజాబ్‌కు చెందిన సోహ్నా-మోహనా సింగ్‌లు ఇద్దరూ అవిభక్త కవలలు. 22 ఏళ్ల వయసులో వీరి జీవనం ఎలా సాగుతోంది? ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారా? తెలుసుకుందాం రండి! 2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్‌లో జన్మించారు ఈ కవలలు.
ఆ ఇద్దరిదీ ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే. మన వీణా వాణిలాగా పంజాబ్‌కు చెందిన సోహ్నా-మోహనా సింగ్‌లు ఇద్దరూ అవిభక్త కవలలు. 22 ఏళ్ల వయసులో వీరి జీవనం ఎలా సాగుతోంది? ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారా.? 2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్‌లో జన్మించారు ఈ కవలలు. చాలా అరుదైన పరిస్థితిలో వీరు జన్మించారు. శరీరంలోని పై భాగం అంతా విడి విడిగానే ఉంటుంది. కానీ తుంటినుంచి దిగువ భాగం మాత్రం కలిసిపోయింది. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు.
ఈ యువకుల తండ్రి సుర్జిత్ కుమార్ టాక్సీ డ్రైవర్. తండ్రికి అప్పటికే ముగ్గరు కుమార్తెలు. కవలలను పోషించలేక రెండు నెలల వయసులో ఢిల్లీలోని AIMSలో విడిచిపెట్టారు. ఆ తరువాత అమృత్‌సర్‌లోని షెల్టర్‌హోమ్ దత్తత తీసుకుంది. డాక్టర్ ఇందర్‌జిత్ కౌర్ కవలలకు సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేసి వీరి ఫస్ట్ బర్త్‌డే ఘనంగా జరిపించారు. ఐటీఐ డిప్లొమా చేసిన ఈ కవలలు పంజాబ్ స్టేట్ పవర్ లో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం సాధించారు. ఇద్దరివీ విలక్షణమైన వ్యక్తిత్వాలు భిన్నాభిప్రాయాలు. సోహ్నా డామినేటింగ్‌గా ఉంటే మోహనా సింగ్ మౌనంగా సెన్సిటివ్‌గా ఉంటాడు. ఎన్నికల సంఘం ఇద్దరికీ వేర్వేరు ఓటర్ కార్డులు జారీ చేసింది. అమృత్‌సర్‌లోని మనవాల్‌లో గత ఎన్నికలలో వీరు ఓటు కూడా వేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.