Flying camera: గాల్లో ఎగిరి ఫొటోలు వీడియో తీస్తుందీ కెమెరా..! అదిరిన స్నాప్‌చాట్‌ కంపెనీ ప్రొడక్ట్‌..

|

May 09, 2022 | 5:46 PM

కెమెరాతో ఫొటోలు వీడియోలు ఓ ప్రొఫెషనల్‌ తీసినట్లుగా తీయడం చాలా మందికి రాదు. అలాంటివారి కోసం గాల్లో ఎగిరే కెమెరా కనిపెట్టింది స్నాప్‌చాట్‌ కంపెనీ. కెమెరా మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీసే ఎగిరే కెమెరాను తాజాగా విడుదల చేసింది.


కెమెరాతో ఫొటోలు వీడియోలు ఓ ప్రొఫెషనల్‌ తీసినట్లుగా తీయడం చాలా మందికి రాదు. అలాంటివారి కోసం గాల్లో ఎగిరే కెమెరా కనిపెట్టింది స్నాప్‌చాట్‌ కంపెనీ. కెమెరా మన చుట్టూ తిరుగుతూ ఫొటోలు, వీడియోలు తీసే ఎగిరే కెమెరాను తాజాగా విడుదల చేసింది. ఎలాంటి సెటప్‌ అవసరం లేకుండా దానంతట అదే పని చేసే ఈ కెమెరాకు ‘పిక్సీ’ అని పేరు పెట్టింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. వెళ్లాల్సిన 4 మార్గాలు ముందే ఇందులో నిర్దేశించి ఉంటాయి. మనకు కావాల్సిన మార్గాన్ని ఎంచుకొని బటన్‌ నొక్కితే గాల్లో తేలుతుంది. మనతో పాటు కదులుతుంది. ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఈ కెమెరాను ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్‌లలో అందుబాటులోకి తెచ్చారు. ధర 17,600 రూపాయలు. ఇందులో 12 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. 2.7కె వీడియోలు తీస్తుంది. 16జీబీ డేటా అంటే దాదాపు వెయ్యి ఫొటోలు, వంద వీడియోల వరకు నిల్వ చేస్తుంది. పిక్సీ బ్యాటరీ ఫుల్‌గా చార్జ్‌ చేస్తే దాదాపు 5 నుంచి 8 సార్లు ఎగురుతుందని చెబుతున్నారు. ఒక్కసారి ఎగిరితే దాదాపు 10 నుంచి 20 సెకన్లు గాల్లో ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Wedding Viral Video: సన్నికల్లు తొక్కమంటే.. ఏకంగా పెళ్లికూతురినే..! నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..

Follow us on