Snakes: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.

|

Jul 05, 2024 | 4:19 PM

రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఎండలకు అల్లాడిన పాములు పుట్టలను విడిచి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్ళలో చొరబడుతున్నాయి. తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం

రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఎండలకు అల్లాడిన పాములు పుట్టలను విడిచి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్ళలో చొరబడుతున్నాయి. తాజాగా అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం, విలసవిల్లి, అమలాపురం మండలాల్లోని పలు ఇళ్లలో పాములు చొరబడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కోనసీమ జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురవడంతో ఇళ్లలోకి విషసర్పాలు ప్రవేశిస్తున్నాయి. తాజాగా ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి లో శ్రీనివాసరావు ఇంట్లోని బెడ్ రూమ్ లోకి నాగుపాము దూరి బుసలు కొట్టింది. అది గమనించిన ఆ ఇంట్లోని వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు.

అంతేకాదు బండారులంకలోని చంద్రశ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో కూడా మరో పాము చొరబడి భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ వర్మ ఘటనా స్థలాలకు వెళ్లి పాములను బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నాగుపాము ఎలాగైనా వారి బారినుంచి తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేసింది. తనను రౌండప్‌ చేసినవారికి కాటేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అయితే స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌ నాగుపాము ఆటలు సాగనివ్వలేదు. ఎంతో చాకచక్యంగా పామును బంధించి సేఫ్‌గా అక్కడినుంచి తరలించాడు. ఇళ్లలో పాములు చొరబడితే చంపవద్దని తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే వర్షాకాలంలో పాములు ఇళ్లలో చొరబడటం సహజమని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.