Current Bills: యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్ బిల్లుల చెల్లింపు బంద్.!
తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు TGSPDCL, TGNPDCL కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నిలిపివేసినట్టు TGSPDCL ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు TGSPDCL, TGNPDCL కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నిలిపివేసినట్టు TGSPDCL ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఇకపై తెలంగాణ విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌పే, గూగుల్ వంటి చెల్లింపు గేట్‌వేల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు.
కాగా యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపు పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉందని, కొన్నేళ్లుగా తమ నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు చెల్లింపు గేట్‌వేలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రకటనపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినమైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యంలో ఒక అడుగు వెనక్కి వేశారంటూ పలువురు వినియోగదారులు వ్యాఖ్యానించారు. ఐఫోన్ వినియోగదారులకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు ఒక్క యాప్ కూడా అందుబాటులో లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ BBPS ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని పలువురు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

