Khammam: ఇంట్లో నాగుపాము బుసలు.. భయంతో జనం పరుగులు. వీడియో
ఇటీవల కాలంలో పాములు తమ ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లల్లో దూరి జనాల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాముల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ త్రాచుపాము జనాన్ని వణికించింది. ఇంట్లోకి చొరబడి ఇంట్లోవాళ్లను పరుగులు పెట్టించింది. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇటీవల కాలంలో పాములు తమ ఆవాసాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇళ్లల్లో దూరి జనాల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాముల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఓ త్రాచుపాము జనాన్ని వణికించింది. ఇంట్లోకి చొరబడి ఇంట్లోవాళ్లను పరుగులు పెట్టించింది. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. మధిర మున్సిపాలిటీ పరిధిలోని అంబారుపేటలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఆరడుగుల నాగుపాము బుసలు కొడుతూ కలకలం రేపింది. ఇంట్లో చిన్నపిల్లలు ఉండటంతో తీవ్ర భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు వెంటనే ఆర్కే ఫౌండేషన్‌కు చెందిన స్నేక్ క్యాచర్ రామకృష్ణకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి చాకచక్యంగా నాగుపామును పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు, స్థానికులు రెస్క్యూ టీం సిబ్బందిని అభినందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...