snake on mirror: బాబోయ్ కారు అద్దానికి భారీ కొండ చిలువ.. ! వైరల్ అవుతున్న వీడియో..
పాములను చూడగానే భయంతో వణికిపోతాం. దాని దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయం. కానీ, ఓ పెద్ద కొండచిలువ ఏకంగా మీ దగ్గరికే వచ్చేస్తే ఎలా ఉంటుంది..ఓ సారి ఊహించుకోండి..పై ప్రాణాలు పైకే పోతాయి కదా..
పాములను చూడగానే భయంతో వణికిపోతాం. దాని దగ్గరికి వెళ్లే సాహసం కూడా చేయం. కానీ, ఓ పెద్ద కొండచిలువ ఏకంగా మీ దగ్గరికే వచ్చేస్తే ఎలా ఉంటుంది..ఓ సారి ఊహించుకోండి..పై ప్రాణాలు పైకే పోతాయి కదా..అచ్చం అలాంటి ఘటనే ఇది..సరదాగా పిక్నిక్ వెళ్లిన ఓ స్నేక్ క్యాచర్ ఫ్యామిలీని భారీ కొండచిలువ హడలెత్తించింది. క్వీన్స్‌లాండ్‌కు బయలుదేరిన టూరిస్ట్ స్పాట్‌కు రాగానే బయట కార్ పార్క్ చేశాడు. తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని లోపలికి వెళ్లిపోయాడు. అయితే కారును పార్క్ చేసేటప్పుడు కిటికీని సరిగ్గా మూయలేదు. దీంతో వారు బయటకు రాగానే ఓ పెద్ద పాము కారులోకి ప్రవేశించింది. ఇంటికి బయలుదేరుదామని కారు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు కారు అద్దానికి చుట్టుకుని ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యిరు..అయితే, స్వయంగా స్నేక్ క్యాచర్ అయిన ఆ వ్యక్తి ఈసారిమాత్రం కొండ చిలువను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మరో స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. దీంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. అనంతరం సమీప అడవి ప్రాంతంలో దానిని వదిలిపెట్టాడు. తనకు ఎదురైనఈ అనుభవాన్ని వివరిస్తూ కొండచిలువ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు స్నేక్ క్యాచర్ జోష్.. దీంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి. దీన్ని చూసిన వారందరూ ‘వామ్మో.. ఎంత భయంకరంగా ఉందో’, ‘ జోష్.. మీ అదృష్టం బాగుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.