Snake in bike: బైక్‌పై దూసుకెళ్లున్న వ్యక్తి.. సడన్‌గా ట్రబుల్‌ ఇచ్చిన బైక్‌.. ఆగి చెక్‌చేయగా షాకింగ్‌ సీన్‌..(వీడియో)

Updated on: Oct 26, 2022 | 9:26 AM

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో మధ్యప్రదేశ్‌ నర్సింగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి బయటినుంచి వచ్చి రాత్రి ఎప్పటిలాగే తన ఇంటిముందు బైక్‌ను పార్క్‌ చేశాడు. మర్నాడు ఉదయం యధావిధిగా పనిమీద బైక్‌పై బయలుదేరాడు.


నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో మధ్యప్రదేశ్‌ నర్సింగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి బయటినుంచి వచ్చి రాత్రి ఎప్పటిలాగే తన ఇంటిముందు బైక్‌ను పార్క్‌ చేశాడు. మర్నాడు ఉదయం యధావిధిగా పనిమీద బైక్‌పై బయలుదేరాడు. కొంతదూరం వెళ్లగానే బైక్‌ కాస్త ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఏంటా అని పరిశీలిస్తే బైక్‌లోంచి వింత శబ్ధాలు వినిపించాయి. అతని అనుమానం మరింత బలపడింది. దాంతో అతను బైక్‌ను పక్కకు ఆపి చెక్‌ చేసాడు. ఇంకేముంది బైక్‌ స్పీడోమీటర్‌లో నల్లటి నాగు పాము దర్శనమిచ్చింది. అది చూడగానే అతను ఒక్కసారిగా షాకయ్యాడు. ఇంతసేపూ తాను ప్రమాదాన్ని వెంటపెట్టుకుని వచ్చానా అని భయపడ్డాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా.. స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు. పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కొన్ని గంటలు శ్రమించి స్పీడోమీటర్‌ అద్దం పగలగొట్టి మొత్తానికి పామును బయటకు తీశారు. దాంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..

Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..

 

Published on: Oct 26, 2022 09:26 AM