మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

మధ్యాహ్న భోజనంలో పాము.. విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

Phani CH

|

Updated on: Jan 19, 2023 | 9:54 AM

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పలు సందర్భాల్లో వికటిస్తోంది. ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు కోకొల్లలు.

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం పలు సందర్భాల్లో వికటిస్తోంది. ఈ భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు కోకొల్లలు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా మయూరేశ్వర్‌ బ్లాక్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఓ పాము పిల్ల వచ్చింది. పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అ‍స్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్న 30 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని హుటాహుటినా రామ్‌పూర్‌హట్‌ మెడికల్‌​ కాలేజ్‌ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే పప్పు నింపిన కంటైనర్‌లో పాము కనిపించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆ పాఠశాలపై దాడి చేశారు. ఉపాధ్యాయుడి వాహనాన్ని ధ్వసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో ఏందీది.. పబ్లిక్‌గా దండేసి.. దండం పెట్టి.. ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు

ఓర్నీ.. ఏంట్రా ఇదీ.. మందుకొట్టడానికి ప్లేసే దొరకలేదా..

దేవుడు కలలో చెప్పాడని.. సైకిల్‌పై 800 కిలో మీటర్లు..

అది అత్యాచారం కిందకు రాదు.. హైకోర్టు సంచలన తీర్పు !!

విధి వంచించినా.. తల వంచలేదు.. కళ్లు లేకపోయినా..

 

Published on: Jan 19, 2023 09:54 AM