Watch: రాత్రికి రాత్రే ఎండిపోతున్న చెట్లు.. అయోమయంలో ప్రజలు.! ఏం జరిగిందంటే.?

|

Dec 12, 2024 | 9:32 AM

ముంబై మహా నగర పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కావాలనే చెట్లను చంపేస్తున్నారు. అదెలా అంటారా..? ఆ చెట్ల బెరడులకు ఇంజక్షన్లు ఇస్తూ ముందుగా ఆ చెట్లను ఎండబెడతారు. అవి ఎండిపోయిన తర్వాత ఆ చెట్లను స్మగ్లర్లు నరికి తీసుకెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో బయటికి వచ్చింది. ఈ సంఘటన ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లాలోని నౌపడ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. చెట్లను నరికి తీసుకెళ్తున్న తతంగం మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది.

ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ రాత్రి రోడ్డు పక్కన స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వారు నాటిన చెట్లకు గుర్తు తెలియని వ్యక్తి ఇంజక్షన్లు వేశాడు. ఆ వ్యక్తి చెట్లు ఎండిపోవడానికి ఉపయోగపడే ఒక మందును ఇంజక్షన్ ద్వారా ఇస్తూ కనిపించాడు. అలా చేసిన కాసేపటి తర్వాత అదే చెట్టు తన పచ్చదనాన్ని కోల్పోయి ఒక్కసారిగా ఎండిపోవడం ప్రారంభించింది. స్థానిక ప్రజలు చెట్లు ఉన్నట్లుండి ఎండిపోవడం వెనక రహస్యం ఏంటో అంతు పట్టక సీసీటీవీని పరిశీలించగా.. నవంబర్ 29న ఎవరో చెట్లకు ఇంజక్షన్‌ వేసినట్లు కనిపించడం.. ఆపై అవి కొద్ది రోజుల్లోనే ఎండిపోవడం గమనించారు. అసలు దేని కోసం ఇలా చేస్తున్నారు? అసలు వాళ్లు ఎవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

నౌపడ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెట్లకు ఇంజక్షన్లు ఇచ్చి ఎండిపోయేలా చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎక్కువగా ఎవరూ లేని సమయం చూసి రాత్రి పూట చీకట్లో చెట్లను నరికి తీసుకెళ్తున్నారని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సీసీటీవీల్లో రికార్డు అవ్వడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా పచ్చని చెట్లను ఎండిపోయేలా చేస్తూ నరికి తీసుకెళ్తున్న తొందర్లోనే గుర్తించి పట్టుకుంటామని, ఇకపై ఇలాంటివి జరగకుండా ఆపుతామని థానే పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.