Smoke on the plane: ఎయిరిండియా విమానంలో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణీకులు.. ఎక్కడంటే.?

Updated on: Sep 21, 2022 | 11:28 AM

విమానంలో సాంకేతిక లోపాలతో ప్రమాదాలు జరుగుతుండటం ఇటీవల తరచూ చూస్తున్నాం. అయితే ఈప్రమాదాల్లో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా


విమానంలో సాంకేతిక లోపాలతో ప్రమాదాలు జరుగుతుండటం ఇటీవల తరచూ చూస్తున్నాం. అయితే ఈప్రమాదాల్లో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజాగా మస్కట్ లో ఎయిరిండియా విమానం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరిని స్లైడ్స్ పై విమానం నుంచి ఖాళీ చేయించారు. విమానం నుంచి పొగలు వ్యాపించిన సమయంలో మొత్తం ఆరుగురు సిబ్బందితో కలిపి 141 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 14 మంది ప్రయాణికులు ఈప్రమాదంలో గాయపడినట్లు సమాచారం.విమానం నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది ప్రయాణీకులందరూ వెనుక ఎమర్జెన్సీ స్లైడ్స్ ద్వారా విమానం ఖాళీ చేయాలని అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణీకులంతా విమానం నుంచి దిగిపోయారు. కాగా ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మస్కట్ నుంచి కొచ్చి వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమవుతుండగా.. ఈప్రమాదం జరిగింది. సిబ్బంది సకాలంలో స్పందించి ప్రయాణీకులను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదమే తప్పింది.అదే విమానం ఫ్లై అయిన తర్వాత ఈపొగలు వ్యాపించి ఉంటే ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండే అవకాశం ఉండేది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 21, 2022 11:28 AM