Smart Elephant: మాకూ ఉన్నాయ్ తెలివితేటలు.. ఏనుగు తెలివికి షాక్ అవ్వాల్సిందే.! ట్రేండింగ్ వీడియో.
అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను మీరు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. తాజాగా
ఈ వీడియోలో ఓ ఏనుగు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఆ తీగను ఒక్క సారిగా దాటకుండా దానిని పరీక్షిస్తుంది. ఎందుకంటే.. సాధారణంగా వన్య మృగాల నుంచి అడవి మార్గంలో వెళ్లే వారిని రక్షించేందుకు.. అటవీ అధికారులు రోడ్డుకు ఇరువైపులా కరెంట్ తీగలతో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. తాను దాటబోయే తీగలో కూడా కరెంట్ ఉందేమోననే అనుమానంతో ఈ ఏనుగు తన కాలితో మెల్లగా తాకుతూ పరీక్షించింది. ఓ నాలుగైదు సార్లు అలా పరీక్షించి, చివరకు ఆ తీగలో కరెంట్ వెళ్లడంలేదని నిర్ధారించుకున్న ఏనుగు తీగలు కట్టి ఉన్న స్థంభాన్ని గట్టిగా నెట్టి దాని మీదుగా రోడ్డు దాటుకుని అవతలి వైపుకు వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘‘తెలివైనవి’’ అనే క్యాప్షన్‌తో ఐఎఫ్‌ఎస్ అధికారిణి గీతాంజలి తన సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. పలువురికి షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘కరెంట్ వల్ల కలిగే బాధను ఈ ఏనుగు అనుభవించి ఉంటుందేమో.. అందుకే తీగలను తనిఖీ చేస్తున్నద’ని ఓ యూజర్ అభిప్రాయపడితే.. మరో యూజర్ ‘ఈ ఏనుగు అందమైనది ఇంకా తెలివైనది’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..